క్రీడాభూమి

ఆల్‌రౌండర్స్‌లో అశ్విన్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 21: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్స్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 31 వికెట్లు పడగొట్టిన అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్టు బ్యాటింగ్‌లో అతను సగటున 31.68 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కంటే ఇది మెరుగైన సగటు కావడంతో అశ్విన్ మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. అతనికి మొత్తం 406 పాయింట్లురాగా, షకీబ్ 384 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్/ 315), ఫిలాండర్ (దక్షిణాఫ్రికా/ 298), రవీంద్ర జడేజా (్భరత్/259), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/254), మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్/ 241), మోయిన్ అలీ (ఇంగ్లాండ్. 224), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా/ 191), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక/ 191) ఈ జాబితా ‘టాప్-10’లో స్థానం సంపాదించారు.
బౌలింగ్ విభాగంలో అశ్విన్ రెండో స్థానంలో ఉండగా, జడేజాకు ఏడో స్థానం లభించింది. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మూడో స్థానంలో జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) ఉన్నాడు.
అదే విధంగా బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్‌సన్ రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను 889 పాయింట్లతో నంబర్ వన్‌గా నిలవగా, జో రూట్ (ఇంగ్లాండ్) 886 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఎబి డివిలియర్స్, స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, యూనిస్ ఖాన్, షహీం ఆమ్లా, ఏంజెలో మాథ్యూస్, అలిస్టార్ కుక్, యాసిర్ షా వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో నిలిచారు.