అనంతపురం

సామాన్య రైతులకే నిబంధనలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, అక్టోబర్ 16: ప్రభుత్వం ఏపథకాన్ని ప్రవేశపెట్టినా వాటికి కొన్ని నియమ నిబంధనలుండటం సహజం. అయితే అవి సామాన్యులకేనా..పలుకుబడి వున్న వ్యక్తులకు వర్తించవా అనేది అందరినీ తొలచివేసే ప్రశ్న. ప్రస్తుతం వెలుగు అధికారుల ఆధీనంలో జరుగుతున్న వర్షాధార భూముల్లో పండ్లతోటల పెంపకం (డ్రైల్యాండ్ హార్టీకల్చర్)లో సామాన్య రైతన్నల పరిస్థితి ఇలాగే కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి.పలుకుబడి వున్న బడా రైతన్నలకైతే ఎటువంటి నిబంధనలు లేకుండానే అన్ని పనులూ సజావుగా జరగడానికి సంబంధిత అధికారులే అండగా నిలుస్తున్నారన్న విమర్శలున్నాయి. స్వయానా సియం చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాను ఉద్యానవన హబ్‌గా మార్చి భూమి వున్న ప్రతి రైతు సంతోషంగా జీవనం కొనసాగించాలన్న ధృక్పధంతో వర్షాధార భూముల్లో పండ్లతోటల పెంపకానికి నాందిపలికారు. ఇందులో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన కొన్ని మాసాలకే 2014 జూలై, 25వ తేదీన మన జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని హార్టీకల్చర్‌ని అనుసంధానం చేస్తూ పండ్లతోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే గతేడాది నుంచి ఉపాధి హామీకి సంబంధం లేకుండా వెలుగు (డీ ఆర్ డీ ఏ) ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఐదు ఎకరాల లోపు వున్న రైతులు ఈపథకాన్ని సద్వినియోగ పర్చుకునే అవకాశం వుంది. ముఖ్యంగా వర్షాధార భూములున్న రైతులకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు ఉత్సాహవంతులైన బోరుబావులున్న రైతన్నలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. మామిడి, నేరేడు, సపోట, జామ, చింత, నీటి సౌకర్యం వున్న రైతన్నలకు చీని చెట్లను అందజేస్తూ పండ్లతోటల పెంపకానికి ప్రోత్సహిస్తున్నారు. 2018-19కి గాను ఇప్పటి వరకు జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో 593మంది రైతన్నలకు 1672.77 ఎకరాలలో, శింగనమల నియోజకవర్గంలో 1164మంది రైతన్నలు 2558.44 ఎకరాలు, తాడిపత్రి నియోజకవర్గంలో 328మంది రైతన్నలు 893.55 ఎకరాలు, గుంతకల్లు నియోజకవర్గంలోని 543మంది రైతన్నలు 1271.44 ఎకరాలు, రాయదుర్గం నియోజకవర్గంలోని 207మంది రైతన్నలు 543.33 ఎకరాలు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 371మంది రైతన్నలు 1225.33 ఎకరాలు, ఉరవకొండ నియోజకవర్గంలో 221మంది రైతన్నలు 715.57 ఎకరాలు, హిందూపురం నియోజవర్గంలో 89మంది రైతన్నలు 185.44 ఎకరాలు, మడకశిర నియోజకవర్గం 183మంది రైతన్నలు 436.37 ఎకరాలు, పెనుకొండ నియోజకవర్గంలో 269మంది రైతన్నలు 629.85 ఎకరాలు, పుట్టపర్తి నియోజకవర్గంలో 567మంది రైతన్నలు 1578.42 ఎకరాలు, ధర్మవరం నియోజకవర్గంలో 1212మంది రైతన్నలు 3946.91 ఎకరాలు, కదిరి నియోజకవర్గంలో 296మంది రైతన్నలు 895.7 మొత్తం 6043మంది రైతన్నలకు 16553.12 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి మంజూరు లభించగా ఇప్పటికే సుమారు 80శాతం గుంతలు తీయడంతోపాటు మొక్కలు నాటుకునే ప్రక్రియ కూడా పూర్తయినట్లు సంబంధిత శాఖ ద్వారా తెలిసింది. ఈ పథకం కింద పండ్లతోటల పెంపంక చేసే రైతన్నలకు మొక్కలు నాటుకోవడానికి గుంతలు, మొక్కలకు, ఎరువులకు, నీళ్ళకు, పరిరక్షణ పర్యవేక్షణకు, అంతర పంటలకు అవసరమయ్యే ఖర్చులన్నీ 3 సంవత్సరాల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. ఎకరాకు 3సంవత్సరాలు సుమారు రూ లక్షా రెండువేలు ఒక్కో రైతుకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. 2018-19 ఏడాది చివరికి సుమారు 17500ల ఎకరాల్లో పండ్ల తోటల సాగు జరగవచ్చని అందుకోసం సుమారు రూ 185కోట్లు అవసరమని సంబంధిత అధికారులు అంచనావేశారు. కాగా మొక్కలు నాటడానికి తీయాల్సిన గుంతలు మాత్రం పూర్తీ స్థాయిలో సాగు చేసే పండ్ల తోటను బట్టి ఎకరాకు ఇన్ని గుంతలను నిర్దేశించిన విధంగా ఎటువంటి యంత్రాలను వినియోగించకుండా ఉపాధి కూలీల ద్వారానే తీయించాల్సి వుంది. అయితే చాలా నియోజకవర్గాల్లో రాజకీయ పలుకుబడి వున్న రైతన్నలు జెసీబీలతో గుంతలు తీయించుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. మరికొంతమంది కొన్ని మండలాల్లో ఎటువంటి మొక్కలు నాటకపోయినప్పటికీ లక్షల రూపాయల బిల్లులు తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళ మేరకు పండ్ల తోటలు సాగుచేయకపోయినా కూడా బిల్లులు చేయాల్సి వస్తుండటం కారణంగా ఎలాగూ తప్పు చేస్తున్నామన్న ఆలోచనతో మండల స్థాయి సిసిలు, ఏపీయంలు కూడా బిల్లుల స్వాహాకు సహకరిస్తు గుట్టు చప్పుడు కాకుండా తమ వాటాను తీసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారన్న తీవ్ర ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఇక సామాన్య రైతన్నల వద్ద అయితే సిసిలు బిల్లులు అందజేయాలంటే మామూళ్ళు ఇవ్వందే బిల్లులు ఇవ్వని దుస్థితి వుంది. ఉదా.. ఒక ఎకరాకు 70మొక్కలు చెప్పున నాటితే వాటిలో కనీసం 10 మొక్కలు ఎండిపోయే అవకాశం వుంది. వాటితోపాటు కేవలం 3 ఎకరాల్లో మాత్రమే సాగు చేసివుండి 5 ఎకరాల్లో సాగు చేసినట్లు తప్పుడు సమాచారం రాసేసుకుని మండల ఎపీయంలు, సిసిలు బిల్లులు స్వాహా చేస్తున్నట్లు కూడా రైతన్నలు ఆరోపిస్తున్నారు. వాటికి సహకరించకపోతే తమకు అందాల్సిన బిల్లుల విషయంలో వేదింపులకు గురిచేస్తారన్న భయంతో మిన్నకుండి పోతున్నామని పలు మండలాల రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పండ్ల తోటల పెంపకం భవిశ్యత్తుకు ఓ ఆసరాగా నిలుస్తుందని శ్రమిస్తూ సామాన్య రైతన్నలు సాగు చేసుకుంటుంటే రాజకీయ పలుకుబడి వున్న వ్యక్తులకు, సంబంధిత అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ డ్రైల్యాండ్ హార్టీకల్చర్‌లో అవినీతి కల్చర్ అధికం అవుతోందన్న ఆరోపణలు గుప్పుమంటుండటం విశేషం.
సమాచారం అందజేస్తే చర్యలు ...వెంకటేశ్వర్లు, పీ.డి. డీ ఆర్ డీ ఏ..
పండ్ల తోటల పెంపకంలో గుంతలు కూలీలతో తీయించకుండా యంత్రాలతో తీయించినట్లు, తోటల పెంపకం లేకపోయినా బిల్లులు స్వాహా చేస్తున్నట్లు, బిల్లుల మంజూరులో అధికారులు వేదిస్తున్నట్లు తనకు సమాచారం అందజేస్తే విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.