అనంతపురం

ఫార్మాడి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 24: ఫార్మాడి విద్యార్థులను మెడికల్ యూనివర్శిటీ కింద పరిగణించి వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫార్మాడి విద్యార్థుల భవిష్యత్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. 6 సంవత్సరాలు వృత్తి కోర్సు పూర్తి చేసుకున్న ఫార్మాడి విద్యార్థులను మన రాష్ట్రంలో సాంకేతిక సిబ్బందిగానే పరిగణిస్తున్నారన్నారు. సంవత్సరాల తరబడి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కోర్సు పూర్తి చేసుకున్న ఫార్మాడి విద్యార్థులకు కనీస విలువ లేకుండా పోతోందని, వారంతా అసంతృప్తితో ఉన్నారన్నారు. ఫార్మాడి పూర్తి చేసుకున్న వారికి ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఏపీలో ఇవ్వడం లేదనే భావన ఉందన్నారు. కావున ఫార్మాడి విద్యార్థులను మెడికల్ యూనివర్శిటీ కింద పరిగణించినట్లయితే తగిన న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 21వేల మంది ఫార్మాడి విద్యార్థులున్నారని, ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.

18 నుండి సీపీఎం జాతీయ మహాసభలు
* జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్
అనంతపురం కల్చరల్, మార్చి 24: ఏప్రిల్ 18 నుండి 22 వరకు సీపీఎం అఖిల భారత మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్ పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో జాతీయ మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యకత నెలకొందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలే ఏదో ఒక పార్టీ అధికారంలోకి వచ్చి, నూతన సరళీకరణ విధానాలు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నాయన్నారు. ప్రజలు రాజకీయ విధానాల్లో మార్పును కోరుకుంటున్నారని, అది వామపక్ష పార్టీలతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో సీపీఎం వైఖరి, రానున్న మూడేళ్లలో సీపీఎం పోరాట కార్యాచరణ తదితరాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహాసభల నేపథ్యంలో ఏప్రిల్ 1 నుండి 16 వరకు ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతాంగం పట్ల తీవ్ర వివక్ష చూపుతోందన్నారు. వేరుశెనగ, కందులు, పప్పుశెనగను రైతుల నుండి సేకరించి, ఇప్పటివరకు వారికి డబ్బులు చెల్లించ లేదన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన వేరుశెనగ, కందులు, పప్పుశెనగ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కందుల కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలన్నారు. ఉపాధి హామీ పనికింద 100 రోజులు పూర్తి చేసుకున్న కూలీలకు మరో 50 రోజులు పని కల్పించాలన్నారు. ఉపాధి కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, బీహెచ్.రాయుడు, బాలరంగయ్య తదితరులు పాల్గొన్నారు.