అనంతపురం

నమ్మక ద్రోహి మోదీకి గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 20 : ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప ధ్వజమెత్తారు. నమ్మక ద్రోహం చేసిన బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాటదీక్షకు సంఘీభావంగా శుక్రవారం హిందూపురంలో చేపట్టిన దీక్షలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అమలు చేస్తామని నమ్మబలికిన మోదీ ప్రభుత్వం చులకనగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా రాష్ట్ర విభజన జరగ్గా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ తరహాలోనే మోదీ కూడా ఎపీకి మొండి చేయి చూపిస్తున్నారన్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనాదక్షతతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు శ్రమిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే దాకా తెలుగుదేశం పార్టీ ఉద్యమాలను ఉద్ధృతం చేస్తుందన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కేసుల నుండి బయట పడేందుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాకులాడుతుండగా అలాంటి ఆర్థిక నేరస్తుడికి కేంద్ర ప్రభుత్వం ఎలా వత్తాసు పలుకుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అటు బీజేపీ ఇటు వైకాపాకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పి మళ్లీ టీడీపీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పొరపాటును ఆర్థిక నేరస్తుడైన వైకాపా అధినేత సీఎం అయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టిస్తారని, ప్రజలు ఈ దిశగా ఆలోచన చేయాలన్నారు. మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీడీపీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, జేఈ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఎపీ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ భాసటగా నిలిచి రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడాకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఎంపీ నిమ్మల తదితర నాయకులకు ముస్లిం మైనార్టీకి చెందిన వృద్ధుడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.

దశలవారీగా ఉద్యమం
పెనుకొండ, ఏప్రిల్ 20 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని, అందుకు దశలవారీగా ఉద్యమం చేపడతామని ఎమ్మెల్యే బీకే పార్థసారధి స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ హోదా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిందన్నారు. కనీసం గతంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులు కూడా సక్రమంగా ఇవ్వకుండా హోదాపై ఇచ్చిన హామీను నిలబెట్టుకోలేకపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.