అనంతపురం

సూపర్ సారా కార్మికుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 20: హిందూపురం సమీపంలోని చిన్నగుడ్డంపల్లి వద్ద గత పదేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన సూపర్ సారా స్పిన్నింగ్ మిల్లు వివిధ కారణాల వల్ల శనివారం నుండి కొద్ది రోజుల పాటు నిలిపివేస్తామని యాజమాన్యం చెప్పడంతో వందలాది మంది కార్మికులు మనోవేదనకు గురయ్యారు. ఎలాంటి నష్టాలు లేకుండా మిల్లు నడుస్తుండగా యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదన్న నెపంతో యాజమాన్యం మూసివేసేందుకు పన్నాగం పన్నుతోందని, దశాబ్దకాలంగా ఈ మిల్లులో పనిచేస్తున్న తాము ఎలా బతకాలంటూ ఉన్నఫళంగా శుక్రవారం మధ్యాహ్నం కార్మికులు మూకుమ్మడిగా మిల్లు ఎదుట హిందూపురం-గోంరట్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సమాచారం అందుకున్న వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ తదితర నాయకులు అక్కడికి చేరుకొని కార్మికులకు సంఘీభావంగా బైఠాయించారు. దీంతో మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం కోయంబత్తూరు ప్రధాన కార్యాలయం తరపున రంగరాజన్ నాయకులు, కార్మికులతో చర్చించారు. వచ్చే నెల 9వ తేదీన కార్మికులందరితో సమావేశం నిర్వహించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మిల్లును కూడా యధావిధిగా నడిపేందుకు యాజమాన్యంతో చర్చిస్తానని భరోసా ఇచ్చారు. అయితే అప్పటి దాకా కార్మికుల పరిస్థితి ఏమిటని నవీన్‌నిశ్చల్ అడగ్గా కొంత మేర ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. మిల్లును యథావిధిగా నడిపేందుకు చర్యలు తీసుకోకపోతే కార్మికుల పక్షాన ఉద్ధృతంగా ఉద్యమాలు చేపడతామని నవీన్‌నిశ్చల్ స్పష్టం చేశారు. హిందూపురం రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శేఖర్ నవీన్‌నిశ్చల్‌తోపాటు కార్మిక నాయకులతో చర్చించి యాజమాన్యం తరపున రంగరాజన్ ఇచ్చిన సమయం దాకా వేచి చూడాలని కోరడంతో ఆందోళన విరమించారు.

ఆక్రమణలు తొలగిస్తేనే అభివృద్ధి
* కౌన్సిల్ అత్యవసర సమావేశం
హిందూపురం టౌన్, ఏప్రిల్ 20 : మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని శుక్రవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్ మాట్లాడుతూ, సూరప్పకుంట ఆక్రమణలను తొలగించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సూరప్పకుంట అభివృద్ధిలో భాగంగా రూ.లక్షతో కంపచెట్లు తొలగించిన విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. సర్వే కోసం కంపచెట్ల తొలగింపు చేపట్టినట్లు వివరించారు. చెరువులో ఆక్రమణలు జరిగాయని, వాటి తొలగింపుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.5 కోట్లతో అభివృద్ధి సాధ్యం కాదని, మరింత నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి, కొట్నూరులకు నీటిని అందించేందుకు రెండు ఇఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణానికి భూసేకరణ అంశంపై దాదాపీర మాట్లాడుతూ, కొట్నూరులో దేవుని మాన్యం ఆక్రమణకు గురయిందని, ఈ స్థలాన్ని ట్యాంక్‌ల నిర్మాణానికి సేకరించాలని సూచించారు. పట్టణంలోని మార్కెట్‌లోని మసీదును ప్రక్కకు తొలగించడానికి, మసీదు మళ్లీ నిర్మించేందుకు సమీపంలోనే ఐదు సెంట్ల స్థలం కేటాయింపుపై చర్చ జరిగింది. స్థలాన్ని కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పట్టణంలో 8 మసీదుల మరమ్మత్తులకు రూ.1.6 లక్షలు, నింకంపల్లి జామీయా మసీదు అభివృద్ధికి రూ.21 లక్షలు మైనార్టీ సంక్షేమ శాఖ నుండి మంజూరైనట్లు ఛైర్‌పర్సన్ లక్ష్మి తెలిపారు. టెండర్లు పిలిచామని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. అజెండాలో కేవలం ఆరు అంశాలను మాత్రమే పొందుపరిచారు. దీనికి తోడు శుక్రవారం ఉదయం సమాచారం ఇవ్వడంతో ఎక్కువ మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేకపోయారు.