అనంతపురం

టీటీడీ సభ్యుడిగా పార్థు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 20: అనంతపురం అంటే తనకు వల్లమాలిన అభిమానమని, అత్యంత ప్రేమ అని, జిల్లా అభివృద్ధికి, సస్యశ్యామలంగా మార్చేందుకు, పారిశ్రామిక, హార్టికల్చర్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానంటూ పదేపదే చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా మరో వరం ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథికి చోటు దక్కింది. ఆయన బోర్డు సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సీఎం జిల్లాపై తన ప్రేమను మరోమారు చాటుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను చైర్మన్‌గా, 14 మంది సభ్యులుగా, మరో ముగ్గురిని ఎక్స్‌అఫిషియో సభ్యులుగా మొత్తం 18 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పార్థసారథికి చోటు లభించింది. ఇప్పటికే జిల్లాకు రెండేసి చొప్పున మంత్రి పదవులు, ఇటీవల రెండు చీఫ్‌విప్ పదవులను కేటాయించారు. అలాగే పార్టీ సంస్థాగతంగా పలు కార్పొరేషన్లకు నామినేషన్ పదవులు ఇచ్చారు. పెనుకొండలో ధర్మ పోరాట దీక్ష శిబిరంలో ఉండగా బీకే.పార్థకు ఈ విషయం తెలిసింది. కాగా అధికారికంగా నియమక పత్రం అందాల్సి ఉంది. 1999లో తెలుగుదేశం అభ్యర్థిగా శింగనమల నుంచి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే దివంగత కొత్తపల్లి జయరాంకు టీడీపీ సభ్యుడిగా అవకాశం దక్కింది. ఇపుడు టీడీపీకి దీర్ఘ కాలం పాటు సేవలందించిన బీకే.పార్థసారథికి మళ్లీ సభ్యుడిగా అవకాశం లభించింది. రొద్దం మండలం మొరవపల్లి గ్రామానికి చెందిన పార్థసారథి బీఏ వరకు చదువుకున్నారు. ఈయన తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం 1984లో పార్టీలో చేరారు. 1987లో పార్టీ మండల కన్వీనర్‌గా కొనసాగారు. అనంతరం 1994లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. 1999లో హిందూపురం ఎంపీగా గెలుపొందారు. 2004లో ఎంపీగా ఓటమి పాలయ్యారు. 2009లోనూ, 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగు దఫాలుగా వరుసగా ఏకగ్రవంగా అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఘనత దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, టీటీడీ బోర్డు సభ్యత్వం లభించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బీకే.పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు.