క్రీడాభూమి

అయోమయానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సెలక్షన్ కమిటీ చైర్మన్ పాటిల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న అంశంపై నెలకొన్న గందరగోళానికి, మీడియాలో వస్తున్న ఊహాజనితమైన కథనాలకు మహేంద్ర సింగ్ ధోనీ ఎంపికతో తెరపడిందని భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ అన్నాడు. జట్టు ఎంపిక ప్రక్రియ పూర్తయన తర్వాత అతను విలేఖరులతో మా ట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి 8 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరి గే టి-20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఎవరు ఉంటారన్నది ప్రజలతోపాటు జట్టు సభ్యులకు కూడా స్పష్టంగా తెలియాల్సిన అవ సరం ఉందని వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీపై ఇటీవల వస్తున్న వార్తలకు తెరదించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు చెప్పా డు. పరిమత ఓవర్ల ఫార్మెట్స్‌లో టీమిండియాకు అతనే నాయకుడి గా ఉంటాడని తెలిపాడు. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లోనూ ధోనీ నాయకత్వంలో టీమిండియా ఆడుతుందని అతను చెప్పకనే చెప్పా డు. కెప్టెన్‌ను సంప్రదించి, అతని సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే జట్టు ఎంపిక జరిగిందని వివరించాడు.