జాతీయ వార్తలు

ఆజాద్ క్షమాపణలు చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యసభలో అధికారపక్షం డిమాండ్ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై రభస

న్యూఢిల్లీ, మార్చి 14: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో పోల్చినట్టు వచ్చిన వార్తలపై రాజ్యసభ అట్టుడికిపోయింది. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. అయితే సభాపక్షం నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆజాద్ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఎప్పుడు సమ్యమనంతో మాట్లాడే గులాం నబీ ఆజాద్ ఈసారి తెలిసో, తెలియకనో తప్పు చేశారని జైట్లీ వ్యాఖ్యానించారు. అధికార పక్షానికి చెందిన మంత్రులు, సభ్యులు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఆజాద్ వ్యాఖ్యలను ఖండించారు. అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు పోడియం ముందుకు దూసుకు వచ్చి ఆజాద్ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలిచ్చారు. టెలికమ్యూనికేషన్ల మంత్రి ప్రసాద్ తీవ్రంగా స్పందిస్తూ ఆజాద్‌పై పరువు నష్టం దావా వేయవచ్చునన్నారు. దీనికి ఆజాద్ బదులిస్తూ ఆదివారం తాను చేసిన ప్రసంగం వీడియో కాపీని సభ ముందు పెడతానన్నారు. ఆజాద్ అంతటితో ఆగక తన ప్రసంగం కాపీని చదివి వినిపించారు. ‘ఐఎస్‌ఐఎస్ లాంటి సంస్థల కార్యకలాపాలను ఖండిస్తున్నాం. ఇదే విధంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను కూడా ఖండిస్తున్నామంటూ’ ఆయన ప్రసంగపాఠాన్ని చదివి వినిపించారు. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐఎస్‌ఐస్‌తో పోల్చడం ఎక్కడుందని ఆజాద్ అడిగారు. అజాద్ వాదనతో అధికారపక్ష సభ్యులు ఏకీభవించలేదు. జైట్లీ మాట్లాడుతూ ‘ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ అంటే నాకెంతో గౌరవం. ఆయన ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా సమతూకంగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆయన తెలిసో, తెలియకనో తప్పు చేశారు’ అని జైట్లీ స్పష్టం చేశారు. ఆజాద్ ఎంత తెలివిగా మాట్లాడినా ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐఎస్‌ఐఎస్‌తో పోల్చడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. మానవాళికే ప్రమాదంగా తయారైన ఐఎస్‌ఐఎస్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌ను పోల్చటం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఆజాద్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐఎస్‌ఐఎస్‌తో పోల్చలేదని, తన ప్రసంగం వీడియో ప్రతిని జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌కు పంపిస్తానని ప్రకటించారు. వీడియోను పరిశీలించిన అనంతరం తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చునని ఆయన అన్నారు. వార్తాపత్రికలు, టివిలు తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తీసుకుని తప్పుగా చిత్రీకరించాయని ఆజాద్ విమర్శించారు.