జాతీయ వార్తలు

యూపీ మంత్రి ఆజంఖాన్‌కు సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బులంద్‌షహర్‌లో తల్లీకూతుళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆజంఖాన్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అధికారంలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. లైంగిక దాడి ప్రతిపక్షాల కుట్ర అని ఆజంఖాన్‌ వ్యాఖ్యానించారు. మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పిటిషన్‌ వేశారు. కేసు విచారణలో యూపీ పోలీసుల తీరు సంతృప్తికరంగా లేదని, కేసును దిల్లీ పోలీసులకు అప్పగించాలని బాధిత కుటుంబం పిటిషన్‌లో పేర్కొంది.