మెదక్

బ్యాడ్ బ్రాండ్‌గా మారిన బిఎస్‌ఎన్‌ఎల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 21: ప్రైవేట్ నెట్ సంస్థలకంటే మెరుగైన సేవలు అందిస్తుందన్న నమ్మకంతో ప్రభుత్వ రంగానికి చెందిన బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు అత్యంత దారుణంగా మారాయి. ప్రతి రోజు ఎదో ఒక రకమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బాండ్ సేవలను వినియోగదారులు సద్వినియోగపర్చుకోలేపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే మరిన్ని ఇబ్బందులే తలెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ సర్వర్ పని చేయకపోవడంతో నెట్ సేవలు స్తంభించిపోయాయి. కొన్ని కనెక్షన్లలో నెట్ కనెక్ట్ అవుతుండగా మరికొన్ని కనెక్షన్లకు నెట్ సేవలు అందకపోవడ ఇదేమి చోద్యమని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, దుబ్బాక, సంగారెడ్డి, నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ నెట్ సేవలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పలు బ్యాంకులకు బిఎస్‌ఎన్‌ఎల్ నెట్ సేవలు ఉండటంతో కంప్యూటర్లు పని చేయని దుస్థితి నెలకొంది. దీంతో అధికారులు, సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వచ్చింది. వారంలో ఒకసారైనా సర్వర్ పని చేయదని, బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, సిబ్బంది ఈ విషయంపై దృష్టి సారించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా బిఎస్‌ఎన్‌ఎల్ నెట్ పని చేయకపోవడంతో పూర్తి చేసిన పనిని పెన్ డ్రైవ్‌ల్లో వేసుకుని ఇతర నెట్‌ల ద్వారా పంపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.