మెదక్

బరిలో మిగిలింది వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పటన్‌చెరులో ఐదుగురు
* ఆర్‌సిపురంలో 8 మంది * భారతినగర్‌లో 9 మంది

పటన్‌చెరు, జనవరి 21: గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ముగిసిన తరువాత ఎన్నికల బరిలో నిలిచింది మొత్తం 22 మంది. పటన్‌చెరు, రామచంద్రాపురం, భారతినగర్ మూడు డివిజన్ల పరిధిలో ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్, బిజెపిలతో పాటు సిపిఎం, ఎంఐఎం లతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన వారు 22 మంది అని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మొత్తం మూడు కార్పొరేటర్ స్థానాలకు గాను 84 మంది నామినేషషన్లు వేయగా అందులో 61 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఒకే నామినేషన్ తిరస్కరణకు గురైంది. పటన్‌చెరు డివిజన్ కార్పొరేటర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెట్టు శంకర్‌యాదవ్, అధికార టిఆర్‌ఎస్ తరపున రాజబోయిన కుమార్‌యాదవ్, బిజెపి తరపున దేవెందర్‌రాజు, టిడిపి నుండి మెట్టుకుమార్‌యాదవ్ తదితరులు ఆయా పార్టీలకు చెందిన బిఫారాలు రిటర్నింగ్ అధికారులకు అందించారు. రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ స్థానానికి టిఆర్‌ఎస్ తరపున తొంట అంజయ్య, టిడిపి తరపున కరికె సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నుండి అవినాష్‌గౌడ్, బిఎస్‌పి తరపున ఎన్.యాదగిరి, సిపిఐ తరపున హజారుద్దిన్, స్వతంత్ర అభ్యర్థులుగా మనోహర్, మల్లేష్, మల్లేషం తదితరులు బరిలో నిలిచారు. భారతినగర్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీలత, టిఆర్‌ఎస్ పార్టీ తరపున సింధురెడ్డి, బిజెపి నుండి గోదావరి, బిఎస్‌పి నుండి రాధ, స్వతంత్ర అభ్యర్థులుగా అరుణశ్రీ, మమత, మాధవిలత, పూర్ణిమ, ఎంఐఎం తరపున షహనా కౌసర్‌లు బరిలో నిలిచారు. ఇక నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ఆయా డివిజన్లలో ప్రచారంలో ముగిపోయారు.