జాతీయ వార్తలు

కళంకిత చరిత్ర నాకు లేదు:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :కళంకితులతో కలిసింది మీరని, గాలి జనార్థన్‌రెడ్డి వంటి వ్యక్తుల మనుషులకు టిక్కెట్లు ఇచ్చి కలిసి పనిచేస్తుందని మీరని, వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డితో తనను ఎలా పోలుస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన శనివారంనాడిక్కడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..తాను యూ టర్న్ తీసుకోలేదని, మీరు తీసుకున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కథలు చెబుతున్నారని విమర్శించారు. లోకసభలో తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై జరిగే పోరాటంలో కలిసిరావాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు శతవిధాల ప్రయత్నించామని, చివరికి సాధ్యంకాక ఎన్డీఏ నుంచి వైదొలగాల్సి వచ్చిందని అన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మరచిపోయారని విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేదాక తాము పోరాటం సాగిస్తామని న్నారు.