జాతీయ వార్తలు

బెంగళూరు కిడ్నాప్ ఘటనలో నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: దక్షిణ బెంగళూరు ప్రాంతంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువతిని ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితుడు అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతనెల 23న యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నిలబడి ఫోన్‌లో మాట్లాడుతున్న 22 ఏళ్ల యువతిని ఓ యువకుడు బలవంతంగా ఎత్తుకుని మోసుకునిపోతున్న దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారం కావడం సంచలనాన్ని సృష్టించింది. తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన కిడ్నాపర్ ఎందుకో భయపడి తనను వదిలేసి వెళ్లిపోయినట్లు ఆ యువతి ఓ చానల్‌కు తెలిపింది. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయనందున ఈ ఘటన ఇన్నాళ్లూ వెలుగుచూడలేదు. కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో సిసి కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించి నిందితుడిని అక్షయ్‌గా గుర్తించి ఎట్టకేలకు అరెస్టు చేశారు.