జాతీయ వార్తలు

యుపి బిజెపి ఎమ్మెల్యేకు ఐసిస్ నుంచి బెదిరింపు కాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరట్, డిసెంబర్ 26: ఐసిస్ మిలిటెంట్ గ్రూపు నుంచి బెదిరింపు ఫోన్స్‌కాల్స్ వచ్చినట్లు యుపి బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో సంగీత్ సోమ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అతనిపై గతంలో కేసు నమోదు చేశారు. తనను చంపుతామంటూ శనివారం ఉదయం 9.30 గంటలకు ఫోన్‌కాల్ వచ్చినట్లు సంగీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్ దక్షిణ అమెరికా నుంచి వచ్చిందని, తనను చంపేందుకు ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు ఇప్పటికే భారత్ చేరుకున్నారని ఎమ్మెల్యే ఫిర్యాదులో వివరించారు. గతంలోనూ తనపై కొంతమంది దాడికి పాల్పడ్డారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడడని విలేఖరులకు తెలిపారు.