జాతీయ వార్తలు

బాబ్రీ బెంచ్ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: బాబ్రీ మసీదు కేసులో బిజెపి నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమాభారతిపై దాఖలైన నేరపూరిత కుట్ర కేసు విచారించే బెంచ్ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి గోపాలగౌడ్ తప్పుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతపై పలువురు బిజెపి, విహెచ్‌పి నేతలపై కేసులు నమోదయ్యాయి.
జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ మిశ్రా కేసును విచారించాల్సి ఉంది. అయితే బెంచ్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు గౌడ ప్రకటించారు. అయితే తప్పుకోడానికి గల కారణాలు ఆయన వెల్లడించలేదు. దీంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. కేసు విచారణ మరొక బెంచ్‌కు అప్పగించడమా, లేదా అన్నదానిపై ఆయనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది. బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, జోషీలతో పాటు 16 మందిని బాబ్రీమసీదు కూల్చివేత కేసు నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని హాజీ మహబూబ్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు.