జాతీయ వార్తలు

ఆసియా బ్యాంకుతో ఆర్థిక స్థిరీకరణ : ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి:ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా భారత్ ముందుకు వెళ్తోందన్నారు. సంపూర్ణ, సమగ్ర ఆర్థిక అభివృద్ధి కోసం ఏఐఐబీ, భారత్ కట్టుబడి ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఇండియాలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. ఆసియా ఖండంలో ఏఐఐబీ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుందని, ఏషియాన్ బ్యాంకులో మొత్తం 87 సభ్య దేశాలు ఉన్నాయని, వాటి మూలధనం సుమారు 100 బిలియన్ల డాలర్లు ఉంటుందన్నారు.