ఐడియా

చలికాలంలో చుండ్రు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలిగాలుల తీవ్రత పెరిగిందంటే చాలు చాలామంది చుండ్రు, శిరోజాలు రాలడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. జుట్టు పొడిబారడం, శిరోజాలు చిట్లిపోవడం వంటి ఇబ్బందుల్ని సైతం కొందరు ఎదుర్కొంటారు. ఇంట్లోనే కొన్ని సులువైన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఈ సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఖరీదైన క్రీమ్‌లు, లోషన్లకు బదులు సహజసిద్ధంగా లభించే ఆకులను ఉపయోగించి చుండ్రు, జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి గంట వ్యవధి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే చుండ్రు తగ్గుతుంది. కొత్తిమీర ఆకుల రసాన్ని తలకు రాసుకుని గంటసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత చన్నీటితో కడిగేసుకోవాలి. బీట్‌రూట్ ఆకులు, గోరింటాకు కలిపి మెత్తగా నూరి, ఆ మిశ్రమంలో కాస్త పసుపు కలిపి తలకు బాగా పట్టించాలి. క్రమం తప్పకుండా ఇలా కొన్ని రోజులు చేస్తే తలపై చుండ్రు, దురదలు తగ్గిపోయి శిరోజాలు బాగా పెరుగుతాయి. వంద మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో కప్పుడు కరివేపాకు వేసి పావుగంట సేపు మరగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను తలకు రాసుకుంటే జుట్టు వొత్తుగా పెరుగుతుంది. కలబంద ఆకుల రసాన్ని తరచూ తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.