ఐడియా

ఇంటి వైద్యంతో మొటిమలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దునే్న ముఖాన్ని అద్దంలో చూసుకుంటే.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మొటిమ వెక్కిరించిందనుకోండి... చాలా కోపం వస్తుంది.. ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ముఖం నిండా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమస్యను పోగొట్టుకునేందుకు ఇలాంటి గృహ చిట్కాలు పాటిస్తే మేలు..
వేప ఆకు
ముదురు వేపాకులు, తులసి ఆకులను మరిగే నీటిలోవేసి బాగా ఉడకబెట్టాలి. నీళ్ళు తక్కువ ఉండేలా చూసుకుంటే మంచిది. బాగా ఉడికిన తరువాత ఆ నీటిని చల్లబరిచి, దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు పెరగవు. ముఖంపై కూడా ఎలాంటి అలర్జీలు రావు.
తులసి
పచ్చటి తులసి ఆకులు, పుదీనాఆకులు కలపి గట్టి గా నలిపి పిండితే రసం వస్తుంది. ఆ రసానికి రెండుమూడు చుక్కల నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే మటుమాయం అవుతాయి. ముఖం తేజోవంతంగా ఉంటుంది.
ఐస్ ముక్కలు:
శుభ్రమైన పొడి గుడ్డను తీసుకుని అందులో ఐస్‌ముక్కల్ని వేయాలి. మడతపెట్టి దానిని మొటిమలపై కాసేపు ఉంచాలి. కొంచెం విరామం తర్వాత మళ్లీ అలానే చేయాలి. రాత్రి పడుకునే ముందు కాటన్‌ను నిమ్మరసంలో తడిపి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి గృహ చిట్కాలు పాటిస్తే పైసా ఖర్చులేకుండా మొటిమలను దూరం చేసుకుని ముఖాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. -

నీలిమ, రాజానగరం