జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:తెలంగాణకు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, బోడ జనార్థన్ రెడ్డి, చాడా సురేశ్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, షేక్ రహ్మతుల్లా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉండగా కొత్తగా రూ.600 కోట్లతో సచివాలయ భవనాలను కట్టాల్సిన అవసరం ఎందుకని అన్నారు. టీడీపీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారని అన్నారు.