హైదరాబాద్

పట్నవాసంలో పల్లెబొమ్మల కొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, నవంబర్ 22: దీపావళి పండుగ సందర్భంగా బొమ్మల కొలువుఏర్పాటు చేయడం తెలుగువారి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నవతరానికి విజ్ఞానదాయకంగా ఉండే రీతిలో సైనిక్‌పురి సాయిబాబా ఆఫీసర్స్ కాలనీకి చెందిన పి.అశోక్‌కుమార్ తాను సేకరించిన వస్తువులతో పల్లెజీవనాన్ని, కులవృత్తులను, చేతివృత్తులను, ఆలయ సందర్శన, గిరిజనుల వేట, అడవిలో జంతువుల విహారం తదితర సందర్భాలను ప్రతిబింబించేలా తమ ఇంటిలో బొమ్మలకొలువు ఏర్పాటు చేశారు. అన్ని తరాలవారిని ఆకర్షిస్తున్న బొమ్మల అమరికను చుట్టుపక్కల కాలనీలకు చెందిన గృహిణులు చూసి తమ చిన్నతనాన్ని, పల్లెజీవనాన్ని నెమరువేసుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కార్తీకమాసం ముగిసేవరకు సైనిక్‌పురి హైటెన్షన్ రోడ్డులో చూడవచ్చని అశోక్‌కుమార్ తెలిపారు.