జాతీయ వార్తలు

దళిత విరోధి.. బయటకు పంపేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కె.సింగ్‌పై బిఎస్పీ సభ్యుల రాద్ధాంతం

న్యూఢిల్లీ, ఆగస్టు 3: హర్యానాలోని ఒక గ్రామంలో ముఠా తగాదాల కారణంగా ఇద్దరు దళిత పిల్లలు సజీవంగా దహనమైన సంఘటనపై వెటకారపు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ ‘దళిత్ విరోధి’ అంటూ నినాదాలు చేస్తూ, రాజ్యసభనుంచి ఆయనను బయటకు పంపివేయాలన్న డిమాండ్‌తో బిఎస్పీ సభ్యులు సంచలనం సృష్టించారు. ఒక మంత్రిని సభనుంచి బయటకు పంపేయాలన్న డిమాండ్ రావటం ఇదే తొలిసారి. జనరల్ సింగ్ గురువారం సాయంత్రం రాజ్యసభలో అడుగుపెట్టిన మరుక్షణం బిఎస్పీ నాయకుడు సతీష్ మిశ్రా ‘దళిత విరోధి అయిన సింగ్ సభలోకి రావటానికి వీలులేదు’ అంటూ నినాదాలు చేశారు. బిఎస్పీ సభ్యులు ఆయనను అనుసరిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మంత్రిని లేదా ఒక సభ్యుడిని సభనుంచి బయటకు వెళ్లిపోవలసిందిగా ఆదేశించే అధికారం సభాపతికి లేదని డిప్యూటీ చైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజ్యాంగం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు.
అనంతరం సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, బిఎస్పీ సభ్యులు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సభ లోపల కాకుండా, వెలుపల కుల రాజకీయాలు చేసుకోండని ఆయన సూచించారు. వి.కె.సింగ్‌ను బయటకు పంపమని అడిగే హక్కు ఎవరికీ లేదని ఆయన వాదించారు. సింగ్ సభలోనే ఉంటారని ఆయన తెగేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కకావికలం చేసిన వర్షాలు, వరదలపై జరిగిన చర్చకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం చెప్పవలసి ఉన్నందున నిరసనను విరమిస్తున్నామని సతీష్ మిశ్రా ప్రకటించారు. అయితే సింగ్ సభలో ఉన్నంతసేపు తాము ఊరుకునేది లేదని అల్టిమేటమ్ ఇచ్చారు.