బిజినెస్

ప్రయాణం మరింత సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: విమాన ప్రయాణ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. ప్రయాణీకులకు ఊరటనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలను శనివారం ఇక్కడ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఓ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు నడిపే దేశ, విదేశీ విమాన సర్వీసులకు మార్పులు వర్తిస్తాయని ప్రకటించారు. నిరుడు 63,400 విమానాలు ఆలస్యంగా నడవడం, 4 వేలకుపైగా విమానాలు రద్దవడంతో ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా జరిగితే ఇకపై ప్రయాణీకులకు విమానయాన సంస్థలు 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రాజు స్పష్టం చేశారు. ఇంతకుముందు నష్టపరిహారంతో పోల్చితే ఇది ఐదింతలు అధికం కావడం గమనార్హం. అయితే ఈ నష్టపరిహారం ఆలస్యం, ఓవర్‌బుకింగ్ తదితర పరిస్థితులు, ఇతరత్రా నిబంధనల ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు. విమానాలు రద్దయిన సమయంలో అన్ని చట్టపరమైన పన్నులనూ ప్రయాణీకులకు రిఫండ్ చేయాలని కూడా పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ చెప్పింది. అలాగే 15 కిలోలకు మించి ఉన్న లగేజీ చార్జీలనూ భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 15 కిలోలపైనున్న లగేజీకి కిలోకు 300 రూపాయల చొప్పున 20 కిలోల వరకు అనుమతిస్తున్నారు. అయితే ఈ చార్జీని 100 రూపాయలకు తగ్గించారు. కాగా, ఎయిరిండియా మాత్రం 23 కిలోల వరకు లగేజీని ప్రయాణీకులతోపాటు ఉచితంగా అనుమతిస్తోంది. ఇక లగేజీ చార్జీల్లో చేసిన మార్పు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందని రాజు ప్రకటించారు. అయితే మిగతా మార్పుల అమలుకు ముందు విమానయాన సంస్థలు తమ అభిప్రాయాలను తెలపవచ్చంటూ రెండు వారాల గడువిచ్చింది పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ. మరోవైపు ఎయిరిండియాతోసహా ఏ దేశీయ విమానయాన సంస్థ తాజా నిర్ణయాలపై స్పందించలేదు. అయితే విమాన ప్రయాణీకుల సంఘం ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎపిఎఐ) మాత్రం స్వాగతించింది. మరింత మంది విమానంలో ప్రయాణించేందుకు ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని ఎపిఎఐ అధ్యక్షుడు డి సుధాకర రెడ్డి అన్నారు. అయితే విమానయాన రంగ నిపుణుల నుంచి మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానయాన మార్కెట్ వృద్ధి పతనానికి దారి తీస్తుందన్న ఆందోళనను వెలిబుచ్చారు. నిరుడు ప్రపంచంలోనే భారత విమానయాన రంగం అత్యంత వృద్ధిని కనబరిచిందని గుర్తుచేశారు. కాగా, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో 10 భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 18,512 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17) సంబంధించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

chitram శనివారం న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న
పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు