బిజినెస్

మెర్రీగో రౌండ్ విధానంతో బొగ్గు రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్‌టిపిసికి మెర్రీగో రౌండ్ రైలు మార్గం ద్వారా మరో 35 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసేందుకుగానూ ఒప్పందం జరిగింది. సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త సమక్షంలో ఎన్‌టిపిసి, సింగరేణి, రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మెర్రీగో రౌండ్ విధానంలో బొగ్గు రవాణాపై జరిగిన ఈ ఒప్పందం దేశంలోనే ప్రప్రథమమని అధికారులు పేర్కొన్నారు. రామగుండం ఏరియాలోగల ఎన్‌టిపిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. రామగుండం-2లోగల సైలో ద్వారా సుమారు 90 లక్షల టన్నుల బొగ్గును ఎన్‌టిపిసికి ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం అందజేస్తుందని సింగరేణి సంస్థ పేర్కొంది. ఈ బొగ్గును ఎన్‌టిపిసి సంస్థ తాను సొంతంగా ఏర్పాటు చేసుకొన్న మెర్రీగో రౌండ్ అనబడే వృత్తాకార రైలు మార్గంలో తమ రైలు బండి ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా రవాణా చేసుకుంటుంది. అయితే పెరిగిన విద్యుదుత్పత్తి రిత్యా ఎన్‌టిపిసికి కావాల్సి ఉన్న మరో 35 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ అక్కడికి దాదాపు 30 కి.మీ. దూరంలో గల రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాల నుంచి దక్షిణ మధ్య రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తోంది. దీనికోసం ఎన్‌టిపిసి టన్నుకు 260 రూపాయలను రవాణా చార్జీలుగా చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ రవాణా విభాగం ఉన్నతాధికారులు ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 35 లక్షల టన్నుల బొగ్గును సుదూర ప్రాంతం నుంచి కాకుండా రామగుండం-2 ఏరియా ఓసిపి-3 సిహెచ్‌పి నుంచి, ప్రస్తుతం ఉన్న మెర్రీగో రౌండ్ రైలు మార్గం ద్వారానే అందించాలని, అయితే దీనికి దక్షిణ మధ్య రైల్వే శాఖ వారి రేకులకు వినియోగిస్తే సౌలభ్యంగా ఉంటుందని సింగరేణి ప్రతిపాదించింది. దీనికి రైల్వే శాఖ ఎన్‌టిపిసిలు అంగీకరించడంతో ఈ కొత్త ఒప్పందం కుదిరింది. ఈ కొత్త ఒప్పందం ద్వారా ఎన్‌టిపిసి రైల్వే శాఖకు టన్నుకు కేవలం 45 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. తద్వారా టన్నుకు 215 రూపాయలు ఆదా అవుతుంది. దీనివల్ల సింగరేణికి కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. రామగుండం ఓసి-3గనికి చెందిన బొగ్గును సులభంగా రవాణా చేసేందుకు వీలు కలుగుతుంది. అలాగే రైల్వే శాఖకు కూడా నిర్దిష్టమైన ఆదాయం.. రైల్వే యేతర మార్గం ద్వారా లభించనుంది. కాగా, ఈ ఒప్పంద పత్రాలపై సింగరేణి నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరి శ్రీనివాస్, రైల్వే శాఖ నుంచి చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండి శేఖరన్, ఎన్‌టిపిసి నుంచి జనరల్ మేనేజర్ (ఓఅండ్‌ఎం) యుకె దాస్‌గుప్తా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ఈ నెల 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది.

chitram ఒప్పంద పత్రాలతో ఎన్‌టిపిసి, సింగరేణి,
రైల్వేశాఖ ఉన్నతాధికారులు