మెదక్

చిరు వ్యాపారులకు అన్యాయం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 21: జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌లపై వెలసిన వ్యాపారాల డబ్బాలను తొలగించడం నిలిపి వేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు వ్యాపారులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్వో దయానంద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి మహబూబ్‌ఖాన్ మాట్లాడుతూ ఉపాధి లేక ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారుల ఉపాధి అవకాశాలను కొల్లగొట్టవద్దన్నారు. అనుమతి లేని భవనాలు, అక్రమ కట్టడాలపై దృష్టి సారించకుండ ఫుట్‌పాత్ డబ్బాలను తొలగించడం దురదృష్టకరమన్నారు. అధికారుల నిర్ణయం చిరువ్యాపారులకు శాపంగా మారిందని దీంతో వారి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యాపారులకు అండగా నిలవాలని కోరారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో సిపిఎం నాయకులు సంతోష్, మహేష్, రాజు, ప్రసాద్, స్వామి, ప్రకాష్, సరిత, కవిత, లాలమ్మ, నాగమణి తదితరులు ఉన్నారు.