జాతీయ వార్తలు

కాంగ్రెస్ పగసాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోరాన్ (అసోం), ఫిబ్రవరి 5: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి అపతీకారం తీర్చుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలు పార్లమెంటును అడ్డుకుంటున్నారని, తద్వా రా పేద ప్రజలకు మేలు చేసే బిల్లులు ఆమోదం పొందకుండా చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలోని మోరాన్‌లో శుక్రవారం తేయాకు తోటల కార్మికులనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ‘ఒక కుటుంబం’ నెగెటివ్ రాజకీయాలకు పాల్పడుతోందని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీనుద్దేశించి విమర్శించారు. అంతేకాదు, మిగతా పార్టీల్లో నాయకులు తనను, బిజెపిని వ్యతిరేకిస్తున్నప్పటికీ పార్లమెంటు పని చేయాలని కోరుకుంటున్నారని కూడా ఆయన అన్నారు. ‘ 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 400 సీట్లనుంచి 40 స్థానాలకు పడిపోయిన వాళ్లు మోదీని పని చేయనివ్వరాదని నిర్ణయించుకున్నారు. అందుకే అడ్డంకులు, ఇబ్బందులు సృష్టించాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ కుట్ర ఇంకా కొనసాగుతోంది’ అని మోదీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీనుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేసినందుకు ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్లు ఇప్పుడు నిర్ణయించుకున్నారని దాదాపుగా ఎన్నికల ర్యాలీ తరహాలో సాగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ అన్నారు. పార్లమెంటు వర్షాకాల, శీతాకాల సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకు పోవడం, ఫలితంగా వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) సహా ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన పలు కీలక బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.