జాతీయ వార్తలు

గిన్నిస్‌లోకి నగదు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానికి సర్ట్ఫికెట్ అందించిన పెట్రోలియం మంత్రి
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: వంటగ్యాస్ నగదు బదిలీ పథకం ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకంగా పథకాన్ని గుర్తిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన సర్ట్ఫికెట్‌ను పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. వంటగ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని గత యూపీఏ ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 1న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం అమల్లో మొదట్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకావడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించి తిరిగి ‘పహల్’ అన్న కొత్త పేరుతో 2014 డిసెంబర్ 14న మొదట 54 జిల్లాల్లో, తర్వాత 2015 జనవరి 1న దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూన్ 30నాటికి 12.57 కోట్ల కుటుంబాలు నగదు బదిలీ సదుపాయాన్ని అందుకుంటున్నాయని, అందువల్ల ‘పహల్’ పథకాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిందని ఇక్కడ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ఈనెల 3నాటికి 14.62 కోట్లమంది ఎల్‌పిజి వినియోగదారులు ‘పహల్’ పథకంలో చేరారని, సబ్సిడీని నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి అందుకుంటున్నారని కూడా ప్రకటన తెలిపింది. పథకం కింద వంటగ్యాస్ సిలిండర్లను దేశవ్యాప్తంగా మార్కెట్ ధరకే విక్రయిస్తారు. అయితే గృహ వినియోగదారులకు మాత్రం పాత ధర అయిన రూ.417కే (్ఢల్లీ ధర) లభించేదుకు వీలుగా సబ్సిడీని వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది. ఈ పథకం వల్ల గృహ వినియోగదారులకు సరఫరా చేసే వంటగ్యాస్‌పై సబ్సిడీ గణనీయంగా ఆదా కావడానికి వీలవుతోందని కూడా ప్రకటనలో పేర్కొన్నారు.