మెదక్

అయుత చండీ మహాయాగానికి అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 22: రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, కరువుకాటకాల నుంచి విముక్తి కల్పించి ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా ప్రసన్నం చేయాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించ తలపెట్టిన అయుత చండీ మహాయాగము బుధవారం ఉదయం నుంచి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం సమీపంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. 40 ఎకరాల సువీశాలమైన స్థలంలో నెల రోజుల నుంచి ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేసారు. సోమవారం వైకుంఠ ఏకాదశి రోజున గణపతి హోమంతో అయుత చండీ మహాయాగానికి సిఎం కెసిఆర్ దంపతులు అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం త్రైలోక్య మోహన్ గౌరి హోమం నిర్వహించడం, గోపూజ తదితర ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ముఖ్యమంత్రి దంపతులు రుత్విక్‌లకు దీక్షావస్త్రాలను అందించి 12 మందికి పాదాభివందనం చేసి ఆశిస్సులు పొందారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం సమయంలో రెండు పూటల అయుత చండీ మహాయాగాన్ని రుత్విజ్‌లు నిర్వహించనున్నారు. యాగాన్ని తిలకించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, భోజన వసతి, భారీకేడ్లు ఏర్పాటు, వైద్య సదుపాయం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, అత్యవసర సేవల నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. మొదటి రోజున ప్రారంభం కానున్న కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వ్యవస్థాపకులు పండిత్ రవిశంకర్, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు తరలిరానున్నారు. బందోబస్తు చర్యలను సైబరాబాద్ సిపి మహేందర్‌రెడ్డి, ఎస్పీ సుమతి దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి వ్యక్తిని సోదాలు చేయకుండా యాగం తిలకించడానికి అనుమతించవద్దని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు. ఎర్రవల్లికి చేరుకునే రెండు దారులపై గట్టి నిఘా ఏర్పాటు చేసారు. దాదాపు 150 సిసి కెమెరాలతో ఎప్పటికప్పుడు నిశిత పరిశీలను చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. బుధవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్న అయుత చండీ మహాయాగానికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. 2 వేల మంది వరకు రుత్విజ్‌లు యాగ క్షేత్రానికి చేరుకుని అన్ని సిద్దం చేసుకున్నారు.