జాతీయ వార్తలు

చర్చల్లో హురియత్‌కు ఎలాంటి పాత్ర ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-పాక్ విదేశీ కార్యదర్శుల భేటీపై కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల మధ్య వచ్చే నెల జరిగే సమావేశం తేదీ, వేదికను ఇంకా ఖరారు చేయలేదని ప్రభుత్వం గురువారం తెలియజేస్తూ, అన్ని ద్వైపాక్షిక సమస్యలను రెండు దేశాలు పరస్పర చర్చల ద్వారానే పరిష్కరించుకోవడం జరుగుతుందని మరోసారి స్పష్టం చేసింది. ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు టచ్‌లో ఉన్నారని, అయితే తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. అన్ని ద్వైపాక్షిక సమస్యలను భారత్, పాకిస్తాన్‌లు పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవడం జరుగుతుందని, ఇటీవల విదేశాంగ మంత్రి ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని, ఆయన విదేశీ వ్యవహారాల సలహాదారుతో జరిపిన సమావేశాల్లో సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించడం జరిగిందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ప్రతినిధి బృందాన్ని మరోసారి హురియత్ వేర్పాటువాదులను లేదా కాశ్మీరీ వేర్పాటువాదులను కలుసుకోవడానికి అనుమతిస్తారా అని విలేఖరులు అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. కాశ్మీరీ వేర్పాటువాదులను కలుసుకోవడానికి అప్పటి పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్‌ను అనుమతించేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో గత ఆగస్టులో జరగాల్సిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దయిన విషయం తెలిసిందే.