జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ప్రశాంతంగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 14శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. 90 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తొలిదశలో 18 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో ఒక్క ఓటు కూడా నమోదు కాని భేజ్జీ, గోర్కా ప్రాంతాల్లో సైతం ఓట్లు వేస్తున్నారు. బందా అనే ప్రాంతంలో ఐఈడీ బాంబులను కనుగొన్నారు. మ‌ధ్యాహ్నం మధ్యాహ్నం 1.30 సమయానికి 33.86 శాతం పోలింగ్ నమోదైంది. మరో పక్క బీజాపూర్‌ జిల్లాలో అనుమానిత నక్సలైట్లు, భద్రతాబలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసొల్యూట్‌ యాక్షన్‌(కోబ్రా)కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.