హైదరాబాద్

పాత నేరగాళ్లకు ఇక చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, నవంబర్ 26: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే కరడుగట్టిన నేరస్థులపై సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ అదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని సిఐ శేఖర్‌గౌడ్, ఎస్‌ఐ ఇ.జహంగీర్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన చైన్‌స్నాచింగ్‌లు, దొంగతనాలు దృష్టిలో ఉంచుకొని వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు చేసి జైలుకి వెళ్లి వచ్చిన పాత నేరస్థులపై నిఘా పెంచామని అన్నారు. జైలు నుండి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తున్నారా లేదా అని విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసుకుంటున్నామని వెల్లడించారు. యాభై కేసులు నమోదైన కరడుగట్టిన నేరస్థులపై సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకు పిడియాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తున్నామని తెలిపారు.
పిడి యాక్ట్ నమోదు చేయడంతో నేరస్థులకు ఏడాది వరకు బెయిల్ లభించదని అన్నారు. సారా తయారు చేయడం, డ్రగ్స్, భూకబ్జాలు, దొంగతనాలు, గుండాయిజం వంటివి పిడియాక్ట్ పరిధిలోకి వస్తాయని తెలిపారు.
పాతనేరస్థుడు నవీన్‌పై పిడి యాక్ట్
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వౌలాలి భరత్‌నగర్‌లో నివసించే తాలుక నవీన్‌కుమార్(35)పై పిడియాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ నవీన్ 2002లో మొదటిసారి దొంగతనం చేసి జైలుకి వెళ్లి వచ్చాడని, ఇతడిపై మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. 18కేసులలో జైలు శిక్ష అనుభవించిన ఇతడు గత ఏడాది సిఫిల్‌గూడలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని హత్య చేశాడని తెలిపారు. నేరచరిత్రను పరిగణలోకి తీసుకొని సిపి ఆదేశాల మేరకు పిడి యాక్ట్ నమోదు చేసి రిమాండ్‌కు తరిలించినట్టు తెలిపారు. గతంలో మల్కాజిగిరి పరిధిలో నివసించే ఎండి ముక్రం అలియాస్ పప్పు, బి.సంజీవ, షేక్‌గౌస్‌పాషాపై పిడియాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించామని ఎస్‌ఐ జహంగీర్‌యాదవ్ తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
ఖైరతాబాద్, నవంబర్ 26: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరలు సమావేశంలో మాలమహానాడు నాయకులు కారెం శివాజీ, కాశన్న మాట్లాడుతూ ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజలను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలే ఉన్నారని వారికి న్యాయం జరిగేవరకు మాలమహానాడు పోరాడుతుందని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. డిపాజిటర్ల సొమ్మును అక్రమమార్గాల ద్వారా ఇతర ఖాతాల్లోకి తరలించి, చైర్మన్ రామారావుతో పాటు డైరెక్టర్లు, వారి బంధువుల పేర్ల మీద బినామీ ఆస్తులు కూడబెట్టారని దుయ్యబట్టారు. చివరికి న్యాయస్థానానికి, ప్రభుత్వానికి కేవలం డిపాజిట్ చేసిన సొమ్ము 7000 కోట్లను చూపుతూ డిపాజిటర్లకు రావాల్సిన వడ్డీ సొమ్మును ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ సంఘటన దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరమని, ఇది సుమారు 28వేల కోట్ల స్కామ్ అని అన్నారు. ఇందులో 38లక్షల మంది డిపాజిటర్లు, ఎనిమిది లక్షల మంది ఏజెంట్లు బాధితులుగా ఉన్నారని అన్నారు. ఇప్పటికే 88 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పి.రామ్మూర్తి, కె.దేవయ్య, నర్సింగ్‌రావు, ఆవుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

మనిషి ఆలోచనపైనే జీవన విధానం ఆధారం

కాచిగూడ, నవంబర్ 26: మనిషి ఆలోచన విధానంలోనే జీవనం ఆధారపడి ఉందని ధర్మపురి పీఠాధిపతి శ్రీసచ్చిదానంద సరస్వతి స్వామి అన్నారు. భక్తి టివి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దిపోత్సవ కార్యక్రమం 12వ రోజు అంగరంగా వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీసచ్చిదానంద సరస్వతి స్వామి భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తమమైన ఆలోచన విధానం, ఉత్తమ సూక్తులు పలకడంతో జీవితం ధన్యం అవుతుందని పేర్కొన్నారు. ఎంత గొప్ప కార్యదీక్షనైనా మనిషి సాధించవచ్చని చెప్పారు. లక్ష్యం చేరడానికి పట్టు విడకుండా కృషి చేసినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతాడని పేర్కొన్నారు. అనంతరం రుషికేశ్ పరమార్థ్ నికేతన్ పూజ్యగురూజీ శ్రీ చిదానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ భారతీయ బుషిలు తమ తపోబలంతో ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుని భారతావనికి అందించారని తెలిపారు. రుషికేశ్ హిందూవులందరికీ కుంటుంబం వంటిదని ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న గంగా హారతిని తిలకించి జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాశివలింగానికి ఉజ్జయినీ మహాకాళ్వేరుడ్ని అభిషేకించిన విభూదితో మహాభస్మాభిషేకం చేశారు. చౌకీలపై ఏర్పాటు చేసిన శివలింగాలకు భక్తులచే సామూహిక కోటి భస్మార్చన కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపరమేశ్వరులను గజవాహనంపై ఊరేగించారు. ప్రధాన వేదికపై అభిషేకించిన భస్మాన్ని భక్తులపై చల్లంచారు. సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీచిదానంద సరస్వతి స్వాములకు గురు సత్కారం చేశారు. వివిధ రాష్టల్రనుంచి విచ్చేసిన కళాకారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.