జాతీయ వార్తలు

తేరుకుంటున్న చెన్నపురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకచోట్ల సరఫరాలు మృగ్యం
మంత్రులపై బాధిత ప్రజల ఆగ్రహం
పాక్షికంగా బస్సు, రైలు సర్వీసుల పునరుద్ధరణ
325కు పెరిగిన మృతులు
ఇంకా నీటి లోతుల్లోనే వందలాది ప్రాంతాలు
చెన్నై, డిసెంబర్ 4: ఊహకైనా అందనంత వర్ష బీభత్సంతో తల్లడిల్లిన చెన్నై, దాని శివారు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వేలాది ఇళ్లు ఇంకా నీట మునిగినప్పటికీ జనజీవన పరిస్థితులు మారనప్పటికీ వర్షం తగ్గడంతో సాధారణ వాతావరణం నెలకొంటోంది. సహాయ చర్యలు మారుమూల ప్రాంతాలకు సైతం అందేందుకు అనువైన వాతావరణం శుక్రవారం నాడు ఏర్పడింది. కొన్నిచోట్ల వరద నీరు వెనక్కి తగ్గడంతో అక్కడ క్రమంగా జనజీవన దైనందిన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పటికీ కూడా లక్షలాదిమంది ప్రజలు నీటి మధ్యే ఉండటంతో వారికి అత్యవసరాలైన మంచినీరు, పాలు, ఆహార పదార్థాల సరఫరా అందని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. అనేక ప్రాంతాల్లో సహాయ చర్యలు అందడం లేదంటూ మంత్రులపైనా, అధికారులపైనా ప్రజలు నిప్పులు చెరిగిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గంలోనే సాయం కోసం ప్రజలు వీధికెక్కారు. సీనియర్ మంత్రులు విశ్వనాథన్, సెల్లూరు రాజు, గోకుల్ ఇందిరలు ప్రజాగ్రహం తట్టుకోలేక వెనక్కి మళ్లారు. అనేక ప్రాంతాల్లో ఈ రకమైన దృశ్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. వౌలికంగా పరిస్థితిలో మార్పు లేకపోయినా వర్ష తీవ్రత తగ్గడంతో నెమ్మదిగానైనా సహాయ చర్యలు పుంజుకునే వాతావరణం బలపడుతోంది. వౌంట్ రోడ్, ఇతర ముఖ్యమైన రహదారుల్లో నేడు ట్రాఫిక్‌ను అనుమతించారు. అడయార్, కువమ్ నదుల నీటిమట్టం తగ్గడంతో అనేక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి అదుపులోకి వచ్చింది. అలాగే చెంబరంబాకం, కుజాల్, కుండి నదులనుంచి కూడా నీటి విడుదల తగ్గడంతో పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి కొంత మెరుగైంది. అనేకచోట్ల రవాణా సర్వీసులు, రైలు సర్వీసులు కూడా పాక్షికంగా ప్రారంభమయ్యాయి.
కాగా, వర్షాల కారణంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 325కు చేరింది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో మృతదేహాలు బయటపడుతున్నాయ. శుక్రవారం సాయంత్రం కూడా భారీగా వర్షం పడటంతో సహాయక చర్యలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
పుదుచ్చేరిలో కుప్పకూలిన 400 ఇళ్లు
పుదుచ్చేరి: చక్కటి టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ ఉన్న పట్టణంగా పేరొందిన, ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ అయిన పుదుచ్చేరి ఇప్పుడు భారీ వర్షాల కారణంగా చెల్లాచెదురైంది. నాలుగు వందలకు పైగా ఇళ్లు ధ్వంసమైనాయి. నవంబర్ నెల ప్రారంభంనుంచి పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసే మొత్తం వర్షం ఒక్క నవంబర్ నెలలోనే కురిసిందని అధికారులు అంటున్నారు. కుండపోతగా కురిసిన వర్షాలకు పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో 400కు పైగా ఇళ్లు కూలిపోయాయి. ఫలితంగా వేలాది మందిని ఆ ప్రాంతాలనుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో 173 సహాయక శిబిరాలు పని చేస్తున్నాయని, పది వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సహాయక చర్యల కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి కందవేలు చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన కుండపోత వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసిందని రాష్ట్రప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మనోజ్ పరీడా చెప్పారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రసాద్ నేతృత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర బృందం ఇప్పటికే పుదుచ్చేరి సందర్శించి నష్టాన్ని అంచనా వేసిందని ఆయన చెప్పారు. ఈ బృందం వచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ భారీ వర్షాలు కురిసాయని, అందువల్ల కేంద్రానికి పంపించడం కోసం ఒక అనుబంధ నివేదికను తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. లెఫ్టెనెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడి పుదుచ్చేరిలో పరిస్థితిని వారి దృష్టికి తీసుకు రావడం జరిగిందని ఆయన చెప్పారు. వరద నీరు నివాస ప్రాంతాల్లోకి చొరబడడం బౌలెవార్డ్ శివార్లలోనే ఎక్కువగా ఉంది. బౌలెవార్డ్‌పరిధిలోని రోడ్లకు ఈ ముప్పు చాలా వరకు లేదనే చెప్పాలి. కాగా, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీటిని బయిటకి పంప్ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. (చిత్రం) జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు.