జాతీయ వార్తలు

సుప్రీం కోర్టులో చిదంబరానికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మంత్రి బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం విదితమే. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే చిదంబరాన్ని సీబీఐ కోర్టు అరెస్టు చేయటం వల్ల ఈ పిటిషన్ చెల్లదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కుంభకోణానికి మొత్తం చిదంబరమే ప్రధాన సూత్రదారి అని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే. అరెస్టు కంటే ముందు తాము పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై విచారణ జరపాలని చిదంబరం తరపు న్యాయవాది వాదనలు వినిపించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇపుడు ఆ పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంది. అరెస్టు తరువాత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరపాల్సి ఉండగా అది ఇంకా లిస్ట్ కాలేదని వెల్లడించింది.