జాతీయ వార్తలు

చైనాకు ‘2.ఓ’ పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: సుమారు నాలుగేళ్ల పాటు శ్రమించి, రూ. 6వందల కోట్లకుపైనే పెట్టుబడి పెట్టి ఓ సినిమా తీశారంటే.. ఆ ప్రయత్నానికి , సాహసానికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అది రజనీకాంత్ సినిమా. అందులోనూ సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కితే.. ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది? అందుకే రోబో ‘2.ఓ’పై అన్ని అంచనాలు పెంచుకున్నారు సినీ అభిమానులు. తరచూ వాయిదా పడుతూ వస్తున్నా.. రజనీ అభిమానులు ఎక్కడా నిరుత్సాహ పడకుండా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్షణ ఫలించింది. నవంబర్ 29న ‘2.ఓ’ వచ్చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసి రికార్డులు తిరగరాసింది. అక్షయ్‌కుమార్, రజనీకాంత్, అమీజాక్సన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాష్‌కరణ్, రాజు మహాలింగం నిర్మించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్ రహెమాన్ సంగీతాన్ని అందించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అక్షయ్‌కుమార్, రజనీకాంత్ నటించిన ప్రాజెక్టులలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలిచిన ఈ చిత్రం చైనా ప్రేక్షకులను అలరించేందు సిద్ధమైంది. చైనాలో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ‘2.ఓ’ 2019, మేలో చైనా ప్రేక్షకులను అలరించేందుకు సర్వం సిద్ధమయింది. చైనాలో అత్యంత ప్రముఖమైన పంపిణీ సంస్థ హెచ్‌వై మీడియాతో కలిసి గర్వంగా విడుదల చేస్తోంది. అక్కడ 10వేల థియేటర్లు..56వేల తెరలు.. 47వేల 3-డీ స్క్రీన్‌లతో ప్రేక్షకులకు వినోదాల విందును అందించబోతోంది. విడుదమైన కొద్దిరోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద విశేష ప్రాచుర్యాన్ని పొందిన ‘2.ఓ’ భారతీయ బాక్సాఫీస్ రికార్డులను పక్కన పెట్టి, చైనాకు పయనమయింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అక్షయ్‌కుమార్ పోటాపోటీగా నటించిన ఈ చిత్రాన్ని హెచ్‌వై మీడియా సోనీ, 20వ సెంచరీ ఫాక్స్, వార్నర్ బ్రోస్, యూనివర్సల్, డిస్నీ వంటి ప్రధాన హాలీవుడ్ స్టూడియోలతో కలిసి ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 29న విడుదలైన ఈ ‘2.ఓ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి విజయవంతమయింది. చైనాలోనూ అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకాన్ని లైకా ప్రొడక్షన్స్ వ్యక్తం చేసింది.