హైదరాబాద్

రాయితీలిస్తాం.. పరిశ్రమలు నెలకొల్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, నవంబర్ 26: హైదరాబాద్ నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలోకి ఎక్కించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ చెప్పారు. ఎల్బీనగర్ చౌరస్తాలో రెండు ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లలో నూతనంగా నిర్మించనున్న ఎంఆర్‌ఆర్ మల్టిప్లెక్స్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతోపాటు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనపక్ష నేత జానారెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు ఎండి అలీ షబ్బీర్ హాజరై భూమి పూజ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ నగరంలో పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు కల్పించి వెంటనే అనుమతులు వచ్చే విధంగా కృషి చేస్తుందని చెప్పారు. వాణిజ్య సంస్థలు రావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు. ఎంఆర్‌ఆర్ మల్టిప్లెక్స్ అధినేత మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొని నాలుగు కోట్లు అనుమతుల రుసుము చెల్లించి కాంప్లెక్స్ పనుల నిర్మాణాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మల్టిప్లెక్స్ కాంప్లెక్స్‌లో ఏడు సినిమా థియేటర్స్‌తోపాటు నాలుగు ఫ్లోర్లలో పార్కింగ్‌తోపాటు ఇతర వాణిజ్య సముదాయాలు నెలకొల్పనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కార్నె ప్రభాకర్, రాంచందర్‌రావు, మల్‌రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.