జాతీయ వార్తలు

గ్రామీణ పేద మహిళలకు వంటగ్యాస్ పథకానికి రూ.8 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ఉద్దేశించిన రూ. 8 వేల కోట్ల పథకానికి కేంద్రమంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూడేళ్ల కాలంలో 8 వేల కోట్ల రూపాయల వ్యయంతో ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను అమలు చేయడానికి ఆమోదం తెలిపిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కుటుంబాల్లోని మహిళా సభ్యులకు యుద్ధ ప్రాతిపదికన ఎల్‌పిజి కనెక్షన్లు ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో నిరుపేదలకు వంటగ్యాస్ సదుపాయం లేదని అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వంటచేసేటప్పుడు పొగ అనే శాపాన్ని ఎదుర్కొంటున్నారని, ఒక సర్వే ప్రకారం వంటింట్లో బహిరంగ మంట ఒక గంటలో 400 సిగరెట్లను తగలేయడం లాంటిదని అం టూ, ఈ పరిస్థితికి పరిష్కారం కనుగొనాల్సిన సమయం వచ్చిందని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ అన్నారు. పేదల కుటుంబాల్లో మహిళల పేరిట వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించిందని, దీనికోసం ప్రారంభ ఖర్చుల కోసం బడ్జెట్‌లో 2 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ పథకం వల్ల 2016-17 ఆర్థిక సంవత్సరంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కోటీ 50 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని, మొ త్తం 5 కోట్ల కుటుంబాలు ప్రయోజ నం పొందడం కోసం ఈ పథకాన్ని మరో రెండేళ్లు కొనసాగించడం వల్ల అందరికీ వంటగ్యాస్ సౌకర్యం లభిస్తుందని జైట్లీ బడ్జెట్ అన్నారు.