హైదరాబాద్

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశలతో అభ్యర్థుల అనుచరులు
ఎవరి ధీమా వారిదే!
హైదరాబాద్, డిసెంబర్ 29: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గం.లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాజేంద్రనగర్ ఆర్డీఒ కార్యాలయంలో మొదలు పెట్టనున్నారు. జిల్లాలోని రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోటీ పడ్డా ఐదుగురు అభ్యర్థులు ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోనే రాజకీయ పరిస్థితుల ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. మెజార్టీ లేకపోయినా రెండు స్థానాలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కైవసం చేసుకుంటాయన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
తొలుత మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి మొదటి రౌండ్‌లోనే బయట పడే అవకాశం ఉందని రెండవ ప్రాధాన్యతగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా టిడిపి, స్వతంత్ర అభ్యర్ధులు సైతం తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ క్యాంపుల్లో ఉన్నా తనకు ఓటు వేస్తారన్న నమ్మకం తమకు ఉందంటూ సదరు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేయడంతో అనుచర వర్గాలు ఆశలతో ఎదురుచూస్తున్నాయి. కొన్ని గంటల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.