ఖమ్మం

హోరాహోరీగా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* క్రాస్‌ఓటింగ్‌పై అభ్యర్థుల ఆందోళన
ఖమ్మం, డిసెంబర్ 27: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ హోరాహోరీగా సాగింది. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలంలలో జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 726 ఓట్లకు గాను 34 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. మొత్తం 692 ఓట్లు పోలయ్యాయి. కామేపల్లి మండలానికి చెందిన ఎంపిటిసి శంకర్ మరణించగా, రఘునాథపాలెం మండలానికి చెందిన కందుల శృతి అనారోగ్యంతో పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. అలాగే సిపిఐ(ఎంఎల్) నూడెమోక్రసీ ముందు చెప్పినట్లుగానే తమ సభ్యులను ఓటింగ్‌కు దూరంగా ఉంచింది.
ఖమ్మంలో 326 మంది ఓటర్లకు గాను 321 మంది, కొత్తగూడెంలో 226కు 199, పాల్వంచలో 115కు 113, భద్రాచలంలో 59కి 59 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికే అధికార పార్టీ తమ ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకరావడం గమనార్హం. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, అనంతరం వామపక్ష పార్టీలు తమ ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చాయి. చివరిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చారు. అయితే ఓటమి భయంతోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో అధికార టిఆర్‌ఎస్ పార్టీ కుమ్మక్కై చివరి నిమిషంలో వారితో ఓట్లు వేయించుకున్నదనే ఆరోపణలు బలంగా వినపడడం విశేషం.
ఇతర ప్రాంతాల్లో రహస్య ప్రాంతాలలో క్యాంప్‌లను ఏర్పాటు చేసి తమ ఓటర్లను గత కొద్ది రోజులుగా అక్కడే ఉంచిన ఆయా పార్టీల నేతలు ఆదివారం అందరిని ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. ఆయా పార్టీల శాసనసభ్యులు, ప్రధాన నేతలు వారి వెన్నంటే ఉండడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ, వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. పోలింగ్ ప్రారంభానికి ముందే అభ్యర్థులంతా ఖమ్మం పోలింగ్ కేంద్రానికి చేరుకొని చివరివరకు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తాము ముందస్తుగా ఒప్పందం చేసుకున్నవారితో కళ్ళతోనే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఒక్కొ పార్టీ తమ ఓటర్లందరిని ఒకేసారి పోలింగ్ కేంద్రానికి తీసుకరావడంతో ఆ సమయంలో ఆ పార్టీ హడావిడి కనిపించింది. అన్ని పార్టీల ప్రధాన నేతలు పోలింగ్ కేంద్రం వద్ద సందడి చేశారు.
కాగా పోలింగ్‌ల క్రాస్‌ఓటింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయా పార్టీల నేతలు ముందస్తుగా తమ ఓటర్లను క్యాంప్‌లకు తరలించి తమకే ఓటు వేసేలా ఒప్పందాలు చేసుకున్నప్పటికీ క్రాస్‌ఓటింగ్ జరిగిందని, అందులో పలు రకాల పద్దతులను అనుసరించారని తెలిసింది. కొంత మంది తమకు రహస్యంగా మద్దతు ఇచ్చేవారిని బ్యాలెట్ పేపర్‌తో దేవుడి బొమ్మలను, పక్షులు, ప్రకృతికి సంబంధించిన చిన్నచిన్న బొమ్మలను ఇచ్చి బ్యాలెట్‌బాక్స్‌లో వేసేలా ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఒక పార్టీకి చెందిన వారిలో ఎక్కువ మంది ఈ పద్ధతిలోనే ఓటు వేసినట్లు తెలుస్తోంది. మరి కొంత మంది ద్వితియ, తృతియ, ఓట్లు తాము చెప్పిన వారికి వేసేలా చేసినట్లు సమాచారం. అయితే ఓటర్లను ఒకేసారి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చినప్పటికీ ఎవరి తర్వాత ఎవరు ఓటు వేయాలనే అంశంపై ముందస్తుగానే శిక్షణ ఇచ్చారని, మొదట ఓటు వేసిన వ్యక్తి తమకు సన్నిహితుడై ఉన్నారని, తర్వాతి వారు ఎవరికి ఓటు వేశారో తమకు తెలుసని పోలింగ్ కేంద్రం వద్దనే ఆయా పార్టీల నేతలు స్పష్టం చేస్తుండడం గమనార్హం. ఆయా పార్టీలకు చెందిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు తమ ఓటర్లతోనే ఓటింగ్ పూర్తి అయ్యేంత వరకు ఉండడం గమనార్హం.
నామినేషన్ సమయంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గౌడి లక్ష్మీనారాయణ, కర్ణం లక్ష్మీనారాయణలు నామినేషన్ దాఖలు చేయగా ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయం సంచలనం కలిగించింది. అధికార పార్టీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ గెలుపును అడ్డుకునేందుకు ఓటర్లను తికమక పెట్టేందుకే మరో ఇద్దరు లక్ష్మీనారాయణలతో నామినేషన్ వేయించారనే ప్రచారం జరిగింది. అయితే ఎన్నిక రోజు మాత్రం వారిద్దరిని పట్టించుకున్న వారు లేకపోవడం గమనార్హం. నామినేషన్ల రోజు హడావిడిగా ఉన్న వారిద్దరు పోలింగ్ రోజు మాత్రం ఒంటరిగానే కనపడడం విశేషం.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్‌తో పాటు ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శ్రీవాత్సవ్, నవీన్‌మిట్టల్, ఆర్‌వో బాబురావులు ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించడంతో పాటు ఖమ్మం, పాల్వంచ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా సందర్శించారు. ఈ ఎన్నికకు జిల్లా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఖమ్మం డిఎస్పీ కె సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌బందోబస్తు నిర్వహించారు.