చిత్తూరు
తిరుమలలో కురిసిన వర్షం...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
తిరుమల, జూన్ 7: తిరుమలలో మంగళవారం ఉదయం నుంచి ఓ మోస్తారుగా వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. గత రెండు నెలలుగా ఎన్నడూ లేనివిధంగా సూర్యుడు ప్రతాపం చూపుతుండడం ఎండ తాపాన్ని తట్టుకోలేక భక్తులు తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నానానికి ఓ మోస్తారుగా కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అనుకోకుండా తిరుమలలో వర్షం పడడంతో భక్తులు ఆలయం ముందు వర్షంలో తడుస్తూ చల్లటి వాతావరణాన్ని ఆశ్వాదించారు. అంతేకాకుండా సందర్శనీయ ప్రాంతాల్లో కూడా భక్తులు కిటకిట లాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చిరుజల్లులు కురుస్తుండటంతో తిరుమల గిరులు ఆహ్లాదకరంగా మారాయి.