చిత్తూరు

జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 7 : జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో చిత్తూరు, తిరుపతి డివిజన్లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మదనపల్లి డివిజన్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో ముందస్తు కురుస్తున్న వర్షాలు రైతులకు ఉపయుక్తం కానున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో తీవ్ర ఎండ వేడిమితో తల్లిడిల్లిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ముఖ్యంగా ఖరీఫ్ సాగుకు అనుకూలంగా వర్షం కురుస్తుండటంతో సాగుకు రైతులు సమాయత్తం అయ్యారు. అనేక మండలాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో మామిడి, అరటి పంటలకు కొంతనష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వాస్తవంగా జిల్లాలో జీవనదులు అంటూ లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు వర్షాధారంతోనే ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తారు. జిల్లాలో ముఖ్యవాణిజ్యపంట వేరుశనగే. ఈ సీజన్‌లో ఎక్కువ విస్తీర్ణంలో వేరుశనగ పంటనే సాగు చేస్తారు. జిల్లాలో ఖరీఫ్‌లో 2.13 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా, అందులో వేరుశనగ 1.36 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారు. అయితే అనేక సంవత్సరాలుగా ఖరీఫ్ సీజన్‌లో సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అనేక సంవత్సరాలుగా వేరుశనగ రైతుల పట్ల వరుణదేవుడు కనికరించకపోవడంతో భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ముందస్తు వర్షం కురిస్తే పంట సాగుచేసిన తర్వాత వర్షం కురవకపోవడం. పంటచేతికి వచ్చే సమయానికి వరుణ దేవుడు కనె్నర్ర చేయడం తదితర కారణాలతో వేరుశనగ రైతులు ఆర్థికంగా చితికిపోయారు. అయితే ఈసారి ముందస్తుగా సాగుకు అనుకూలంగా వర్షం కురుస్తుడటంతో రైతులు ఎన్నో ఆశలతో పంట సాగుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో ఇది వరకు అనేక మండలాల్లో వర్షం కురవడంతో పొలాలు దున్ని సిద్ధమయ్యారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా సరాసరి 11.1 మి.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరులో 48 మి.మీ, నాగలాపుంలో 42.2, పిచ్చాటూరులో 31, నారాయణ వనంలో 24, రామసముద్రంలో 21, పుత్తూరులో 20, నిండ్రలో 35, గంగాధర నెల్లూరులో 39, పాలసముద్రంలో 38, యాదమరిలో 34, కార్వేటినగరంలో 17 మి.మీ వర్షం కురిసింది.