చిత్తూరు

ఎర్ర స్మగ్లర్ సంగీతా ఛటర్జీ అరెస్టుకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 9: ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నడుపుతున్న కలకత్తాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతాఛటర్జీ అరెస్టుకు చిత్తూరు జిల్లా పోలీసులు రంగం సిద్ధం చేశారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కలకత్తాకు వెళ్లాయి. ఆమెపై జిల్లాలో నమోదు అయిన కేసుల విచారణ కోసం రావాల్సి ఉండగా రాకపోవడాన్ని జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకొన్నారు. ఇటీవల చిత్తూరు పోలీసులు కలకత్తాకు చెందిన బడా స్మగ్లర్ లక్ష్మణన్‌ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు కలకత్తాలో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష్మణన్ భార్య సంగీతాఛటర్జీ ఇంటిపై దాడులుచేసి పలు విలువైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణన్ అరెస్టు తరువాత ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాల్లో ఆమె కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టుచేసి అక్కడ కోర్టులో హాజరు పర్చగా అక్కడి న్యాయవాదుల సహకారంతో ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈనేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సంగీతా ఛటర్జిపై అనేక కేసులు నమోదయ్యాయని విచారణ నిమిత్తం ఆమెను తమకు అప్పగించాలని జిల్లా పోలీసులు కలకత్తా కొర్టులో ఫిటీషన్ దాఖలు చేశారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని పలుమార్లు కలకత్తా కోర్టులో ఫిటీషన్ దాఖలుచేసి ఆమె బెయిల్ పొందుతున్నారు. ఆమెపై అనేక కేసులు నమోదు అయిన తరుణంలో వీటి విచారణ కోసం తమకు సంగీతా ఛటర్జిని అప్పగించాలని అక్కడ కోర్టుకు విన్నవించి ఇక్కడికి తీసుకు రావడానికి జిల్లా పోలీసలు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.