చిత్తూరు

జిల్లాలో 62మండలాల్లో వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 9: జిల్లాలో 62మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. పుంగనూరులో అత్యధికంగా 69మి.మీ వర్షపాతం నమోదైంది. కెపి పల్లెలో 46మి.మీ, రామసముద్రం 40.6, సోమల 62.4, చిన్నగొట్టిగల్లు 23.4, నారాయణవనం 38.8, పుత్తూరు 24.2, పూతలపట్టు 21, తవణంపల్లె 24, పుంగనూరు 48, ఐరాల 38, పలమనేరు 25.4, పెద్దపంజాణి 35, తవణంపల్లె 24మీ.మీ వర్షపాతం నమోదైంది.

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
వాల్మీకిపురం, జూన్ 9: ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన గురువారం వాల్మీకిపురంలో చోటుచేసుకుంది. సంబంధిత వివరాల మేరకు మదనపల్లె రూరల్ మండలం కాశీరావుపేటకు చెందిన హరి కుమారుడు గణేష్(10), దొరబాబు కుమార్తె భూమిక(12)లు ఇద్దరు సమీప రిజర్వాయర్ సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లారు. సాయంకాలం ఇద్దరూ కలిసి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వీరిని గమనించిన మరోక బాలిక గట్టిగా కేకలు వేయడంతో సమీప పొలాల్లోని రైతులు అక్కడికి చేరుకునేలోపే చిన్నారులు ఇద్దరూ మృతిచెందారు. ఈసంఘటనతో కాశీరావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.