చిత్తూరు

లారీకి ప్రమాదం.. ట్రాఫిక్‌కు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూన్ 9: పట్టణంలోని పానగల్లులో నక్కలకాలువ వంతెనపై ఒక లారీ ప్రమాదవశాత్తూ ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లూరు వైపు నుంచి తిరుపతి వైపు ఇనుపకమీలతో వెళ్తుండిన భారీ లారీ నక్కల కాలువ వంతెనపై అడ్డు తిరగడంతో వాహనం ఎటూ పోలేక రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. వాహనం కొంత భాగం కాలువలోకి దూసుకెళ్లడంతో దాన్ని రోడ్డుపైకి తీసుకురావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంతేకాకుండా శ్రీ కాళహస్తి పోలీసులు కడపలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లడంతో పోలీసు అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సుమారు 10 గంటలకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తిరుపతి, నెల్లూరు, చెన్నై మార్గాల నుంచి వచ్చి వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరుపతి వైపు వెళ్లడానికి మరో మార్గం లేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి కూడా అదేమార్గం కావడంతో రైళ్లల్లో వెళ్లాలనుకున్న వారు కూడా వెళ్లలేకపోయారు. చివరకు పోలీసులు అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డుపైకి మళ్లించడంతో వాహనాల రాకపోకలు తిరిగి కొనసాగాయి.