చిత్తూరు

ఇ-పబ్లికేషన్స్‌లో టిటిడి ప్రచురణలకు విశేష ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 9: ధర్మ ప్రచారంలో బాగంగా భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేందుకు ఇ-పబ్లికేషన్స్‌లో ఉంచిన టిటిడి ప్రచురుణలకు విశేష స్పందన లభిస్తోంది. టిటిడి ఇ ఒ డాక్టర్ డి సాంబశివరావు సూచనల మేరకు ఇప్పటి వరకు వివిధ భాషలకు చెందిన 3653 గ్రంథాలను టిటిడి వెబ్‌సైట్‌లోని ఇ-పబ్లికేషన్స్‌లో ఉంచింది. వీటిలో శ్రీవారి వైభవాన్ని తెలిపే పుస్తకాలతోపాటు అనేక ధార్మిక విషయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలు పిల్లలు నుంచి పెద్దల వరకు అకట్టుకుంటున్నాయి. టిటిడి ముద్రించిన గ్రంథాలను, ముద్రణకు ఆర్థిక సహాయం చేసిన గ్రంథాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేసి విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా టిటిడి ప్రచురణలను ఉచితంగా చదువుకోవడంతోపాటు డౌన్‌లోడ్ చేసుకునేందుకు 2015, మార్చి 21 శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది కానుకగా ఇ బుక్స్.తిరుమల. ఓ ఆర్ జి అనే వెబ్‌సైట్‌ను భక్తలోకానికి అందించింది. ఇప్పటిదాకా 10.65లక్షల మందికిపైగా పాఠకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. 250 పుస్తకాలతో ప్రారంభమైన ఈవెబ్‌సైట్ అతి తక్కువ కాలంలోనే వైదిక సాహిత్యం, పురాణ, ఇతిహాస సాహిత్యం, కావ్యప్రబంధ సాహిత్యం, సంకీర్తన సాహిత్యం, శతక బాల సాహిత్యం, ఆలయ ఆగమ సాహిత్యం, సర్వస్వం అనే ఏడు విభాగాల్లో పుస్తకాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో తెలుగులో 1197, సంస్కృతం 70, ఇంగ్లీషు-226, కన్నడం-175, హిందీ-181, తమిళం-302, బంజారా-2 కలిపి 3653 గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటుగా భగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ వెబ్‌సైట్‌లో రామానుజులకు సంబంధించిన 22 నూతన గ్రంథాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. త్వరలో మరో 75 నూతన గ్రంథాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతేగాక, టిటిడి సప్తగిరి మాసపత్రిక ప్రతులు 1975వ సంత్సరం నుంచి ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తిరుమల, తిరుపతిలోని పుస్తక విక్రయశాలల్లో వేలాది ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తక విక్రయశాలల్లో పుస్తకాలు కొనుగోలు చేయలేని భక్తుల కోసం టిటిడి ఇ-పబ్లికేషన్స్‌లో ఉచితంగా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టిటిడి పి ఆర్వో రవి కోరారు.