చిత్తూరు

పశ్చిమాన జోరందుకున్న ఏరువాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*తొలకరి పలకరింపు పుడమితల్లి పులకింత
*కోటి ఆశలతో పడమటి కరవురైతు ఖరీఫ్‌సాగు
‘‘ఎదురుచూస్తున్న ఏరువాక రానే వచ్చింది... ఏరువాకతోపాటే తొలకరి పలకరించింది...తొలకరి పలకరింపుతో పుడమితల్లి పులకించింది... పచ్చపచ్చని ప్రతిఆకూ... పసందైన కథ వినిపిస్తోంది... కొమ్మరెమ్మల్లో దాగిన కోయిల ఆ‘పాట’లే ఆలపిస్తోంది..’’
మదనపల్లె, జూన్ 10: తొలకరి పలకరింపుతో ప్రకృతి పరవశించిపోతోంది. మండుటెండల తీవ్రత కొంతమేరకు తగ్గింది. ఉక్కపోతతో ఉడుకుతున్న జనం రెండురోజులుగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే గాలి, వాన బీభత్సం చాలా నష్టమే చేశాయి. మామిడి కాయలు రాలిపోవడం, చేతికి అందివచ్చిన వరిసాగు నేలకొరగడం, టమోటా తదితరాల వలన భారీగా నష్టం సంభవించింది. మొలకలపున్నమి ముందే వర్షాలు కురవడంతో కరువురైతులు అప్పుడే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతమంది రైతులు దుక్కులు దున్నడం ప్రారంభించారు. ముంగార్ల వర్షం జోరుగా వస్తుండటంతో ఈసారైనా నడికారు సేద్యం కలిసి వస్తుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా మరి కొంతమంది రైతులు ఆవలు ఎక్కడ ఆవిరి అయిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత ఏడాది కూడా ముందుగానే వర్షం కురిసింది. దీంతో రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని పంటలు వేశారు. అయితే పంటలు కాయలు పట్టే దశలో వర్షం వెనుకకు వెళ్ళింది. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పంటలు చేతికి అందకపోవడంతో రైతులకు పెట్టుబడి కూడా గిట్టలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈయేడాదైనా పంటలు చేతికి దక్కుతాయేమోనని రైతులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందించే రాయితీ విత్తనం సకాలంలో అందడానికి ముందే రైతులు ప్రైవేట్ ఏజెన్సీలను ఆశ్రయించిన కొందరు ఏకంగా చేలలో విత్తనాలు వేసుకుంటున్నారు. ఈసారైనా దేవుడు కరుణించాలని కోటిఆశలతో ఖరీఫ్‌కు అన్నదాతలు సన్నద్దమవుతున్నారు.