జాతీయ వార్తలు

బాలల హక్కులను రక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని చిన్నారుల హక్కుల సంఘాలలో ఖాళీలను భర్తీ చేయాలని, తద్వారా బాల్య న్యాయ చట్టాన్ని సమర్ధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేర కు శరపరంపరగా ఆదేశాలను జారీ చేసింది. అలాగే బాల్య న్యాయ మండళ్లు, శిశు సంక్షేమ సంఘాలలో అన్ని స్థాయిలలోను పదవులలో నిబంధనల మేరకు తగినవారిని త్వరితగతిన నియమించాలని జస్టిస్ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయం లో జాప్యం జరిగితే చిన్నారుల భవితవ్యంపై ప్రతికూ ల ప్రభావం పడుతుందని, అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. బాల్య న్యాయ చట్టాన్ని సమర్ధంగా అమలు చేయడం లేదని, వీటి అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. పిల్లల సంరక్షణ, భద్రతకు కీలకమైన బాల్య న్యాయ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేసే విధివిధానాలు రూపొందించే బాధ్యతను ఆయా రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులు భుజాన వేసుకోవాలని ధర్మాసనం కోరింది. అలాగే ప్రతి జిల్లాలో ‘చిన్నారుల స్నేహపూర్వక న్యాయస్థానాలు’, ‘కీలక సాక్ష్యాల నమోదు న్యాయస్థానాల’ ఏర్పాటు అంశాన్ని తీవ్రంగా పరిశీలించాలని సూచించింది.
చిన్నారుల సంరక్షణ, భద్రతకు అవసరమైన ఈ చర్యలను కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర చిన్నారుల హక్కుల పరిరక్షణ సంఘాలు తక్షణం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.