Others

ఆశ ఖరీదు అణా (గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరూ అలాగే అయిపోకండి. బిచ్చగాడి దారిద్య్రానికీ, పిల్లవాడిని వాడి తల్లిదండ్రుల మూర్ఖత్వానికి నిందించకండి.
కృష్ణ: అయితే బతికి చూడమంటారు.
తా: విధిగా! కుర్రవాళ్లు పడుచుతనంలో ఉన్నారు.
అన్న: మీరు ఇనే్నళ్లు బతికారు గదా! మీరు అనుభవించిన ఆనందం ఏమిటి?
తా: బోలెడంత! వర్షాకాలం గొడుగేసుకుంటే ఆనందం. ఎండాకాలం చన్నీళ్ళు స్నానం చేస్తే ఆనందం. శీతాకాలం దుప్పటి కప్పుకుంటే ఆనందం. బతకండి నాయనా! .. అబ్బారుూ, నువ్వు బొమ్మలు వేస్తావు కదూ! వెయ్యి. లోకంలో నువ్వు చూసిన ఆనందాన్ని, సుఖాన్ని, మనిషిలోని మంచినీ- బొమ్మలుగా చిత్రించు. కృష్ణవేణీ! ఇందిరా మీరిద్దరూ మీలోని స్ర్తిత్వానికి సాఫల్యాన్ని కలిగించుకోండి. ఎవరికీ, దేనికీ భయపడకండి. మీరు వినవలసిన పాటలు ఇంకెన్నున్నాయో చూడండి!
కృష్ణ:- ఇందిర:- నిజమేనండి.
తా: అబ్బారుూ నువ్వు కారుకింద పడిపోవాలనుకున్నావు. తప్పిపోయినందుకు ఇప్పుడెంత హాయిగా ఉందో చూశావా?
యు: అబ్బ! ఎంత చలిగా ఉంది! తెల్లారవస్తోంది కాబోలు!
తా: అవును. మీకందరికీ బతకడం నేర్పుతానుండండి.
(కాఫీ కాఫీ అంటూ గంట వాయించుకూ మనిషి)
ఏయ్ అబ్బీ! కాఫీ ఎంత?
అబ్బి: అణా బాబూ.
తా: అందరికీ తలకో గ్లాసు ఇయ్యి.. తాగండి అందరూ.. తాగారా? ఇప్పుడెలా ఉంది?
కృ: ఇలా తెల్లారుఝామున రోడ్డుమీద లాంతరు కాఫీ ఎప్పుడూ తాగలేదు! ఎంత బాగుంది! నీళ్ల కాఫీయే అనుకోండి, అయితేనేం ఇలా తాగడం బాగుంది.
ఇం: మరే! ఎందుకో ప్రాణం లేచి వచ్చింది. మీరు గొప్పవాళ్లు తాతగారూ.
తా: చూశారా మరి! మనిషికొక్క అణాతో అందరికీ మళ్లీ ఎంత ఆశ వచ్చిందో!
కృ: మరిచిపోయిన ఆశలు మళ్లీ జ్ఞాపకం వొస్తున్నాయి. తెల్లవారుతోంది.
యు: ఇంకో కొత్త ప్రభాతం!

- అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)*
................................................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003