జాతీయ వార్తలు

దుర్గ భక్తురాలినే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ వర్శిటీ ఘటనలపై గురువారం సమాధానమిస్తూ దుర్గమాతపై చేసిన వ్యాఖ్యలు శుక్రవారం రాజ్యసభలో దుమారం రేపాయి. స్మృతి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవకు దారితీయడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. దుర్గా మాత దూషణకు పాల్పడిన స్మృతి బేషరతు క్షమాపణ చెప్పాలని, ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ప్రతిపక్షం ఉప నాయకుడు ఆనంద్ శర్మ, ఇతర ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పేందుకు స్మృతి నిరాకరిస్తూ, జెఎన్‌యులో వామపక్ష విద్యార్థులు పంచిపెడుతున్న కరపత్రాల్లోని అంశాలను మాత్రమే చదివి వినిపించానని వాదించారు. పవిత్ర దేవాలయంలాంటి వర్శిటీలో ఏం జరుగుతుందో వివరించేందుకే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ‘జెఎన్‌యులో ఏం జరుగుతోందని మీరు అడిగారు. వాస్తవాలు వెల్లడించాలని వత్తిడి తెచ్చారు. కనుక దుర్గా మాతపై కొందరు విద్యార్థులు పంచి పెడుతున్న కరపత్రంలోని అంశాలను సభ ముందు పెట్టాను’ అని స్మృతి వాదించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి ఆమె వాదనను సమర్థించారు. అయితే ప్రతిపక్షం మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. స్మృతి క్షమాపణలు చెప్పకుంటే సభను నడవనిచ్చే ప్రసక్తే లేదని ప్రతిపక్షం స్పష్టం చేయటంతో గొందరగోళం నెలకొంది. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె కురియన్ మాట్లాడుతూ స్మృతీఇరానీ నిన్న సభలో చేసిన ప్రసంగ పాఠాన్ని పరిశీలించి దైవ దూషణ చేసివుంటే తొలగిస్తామని హామీ ఇచ్చినా సభ్యులు శాంతించలేదు. సభలో దైవ దూషణ నిషిద్ధమని ఆనంద్ శర్మ స్పష్టం చేస్తే, స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందేనని జెడి(యు) సభ్యుడు కెసి త్యాగి డిమాండ్ చేశారు. స్మృతి వ్యాఖ్యలపై రూలింగ్ ఇవ్వాలని సీతారాం ఏచూరి కురియన్‌ను డిమాండ్ చేశారు. దీనికి స్మృతీ తీవ్రంగా స్పందిస్తూ విపక్షాలు సాక్ష్యాలు కోరాయి కనుకే సభలో కరపత్రాన్ని చదివి వినిపించానని గట్టిగా వాదించారు. దీంతో సభలో మరోసారి గొడవ చెలరేగింది. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఒక సందర్భంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి దుర్గాదేవి అనే బిరుదు ఇస్తే ఆమె నిరాకరించారని, దేశంలోని ఎంతోమంది దళితులు బాధ పడతారు కనుక తాను బిరుదును స్కీకరించలేనని ఇందిరాగాంధీ స్పష్టం చేసినట్టు ఏచూరి వివరించారు. దీనికి సభా నాయకుడు అరుణ్‌జైట్లీ లేచి సభ ముందు ఏచూరి తప్పుడు సమాచారం పెడుతున్నారని ఆరోపించారు. మరోవైపు స్మృతీ ఇరానీ మాట్లాడుతూ తాను జెఎన్‌యు విద్యార్థుల కరపత్రం చదివి వినిపించాను తప్ప, దైవ దూషణకు పాల్పడలేదని పదేపదే స్పష్టం చేశారు. ఈ దశలో కురియన్ జోక్యం చేసుకుని ప్రైవేట్ మెంబర్స్ బిల్లుల కార్యక్రమం చేపట్టటంతో సభ సద్దుమణిగింది.