జాతీయ వార్తలు

దేశంలో ప్రమాదకర ధోరణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత సమాజం ముక్కలు చెక్కలయ్యే పరిస్థితి నేడు నెలకొందని 1947లో దేశ విభజన సందర్భంగానూ, 1992లో బాబర్ విధ్యంసం తర్వాతే ఈ రకమైన ప్రతికూల ధోరణులు ఏర్పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం అని మతపరమైన అంశాలపైన ఇతర విషయాల్లోనూ జరుగుతున్న చర్చే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రతి ఒక్కరిలోనూ అభద్రతా భావం నెలకొందని, ముస్లింను పలకరించినా, దళితుడ్ని అడిగినా, అలాగే ఒక రైతును కదిలించినా కూడా ఈ రకమైన భయమే కనిపిస్తుందన్నారు. ‘స్టాండింగ్ గార్డ్..ఏ ఇయర్ ఇన్ అపోజిషన్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా చిదంబరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ హాజరయ్యారు