అనంతపురం

దివాళాతీస్తున్న ఆర్టీసీని కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం,జనవరి 22 : దివాళాతీస్తున్న ఆర్టీసీని సంరకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్‌ఆర్ ఆరీ టసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఆర్టీసీని తాకట్టు పెడితేగాని కార్మికుల కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీని కాపాడేందుకు ఏమా త్రం చర్యలు తీసుకోకపోగా తెలుగు తమ్ముళ్లకు ధారదత్తం చేయడానికి పూనుకోవడం శోఛనీయమన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉం డాల్సిన ఆర్టీసీ బస్సులు టిడిపికి చెం దిన బడాబాబుల హస్తగతమయ్యే ప రిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యతను స్వీకరించిన వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగనున్న యూనియన్ ఎన్నికల్లో తమ యూనియన్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు కాపు రామచంద్రారెడ్డితోపాటు జడ్పీటీసీ విజయకుమార్ బాబు, వార్డు సభ్యులు పేర్మి బాలాజీ, అబ్దుల్ రహమాన్, సర్మస్, మాధవరెడ్డి, దిలావర్‌బాషా వైఎస్‌ఆర్ ఆర్టీసీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నెట్టికంటి సన్నిధిలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్
గుంతకల్లు, జనవరి 22: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఎఇఓ ధనుంజయ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిపాలన పరమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.