జాతీయ వార్తలు

ఆ దాడిపై సమాధానమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పాటియాలా హౌస్‌కోర్టులో జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తదితరులపై దాడికి పాల్పడిన ముగ్గురు న్యాయవాదులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ దాడిపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ముందస్తు ప్రణాళిక ప్రకారం తామే ఈ దాడికి పాల్పడ్డామని, పెట్రోల్ బాంబులతో దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ముగ్గురు న్యాయవాదులు చెప్పడం ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, ఎఎం సాప్రేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ ముగ్గురు న్యాయవాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి నాలుగో తేదీకి వాయిదా వేసింది. న్యాయవాది కామిని జైస్వాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై నోటీసులు జారీ చేయడానికి తొలుత ధర్మాసనం అయిష్టత వ్యక్తం చేసింది. ఇదే అంశంపై విచారణ కొనసాగుతోందని, ఆ కేసు మార్చి పదో తేదీన విచారణకు వస్తుందని ధర్మాసనం తెలిపింది. ‘ఇదే అంశానికి సంబంధించి మరో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆ కేసులో విచారణ ముగియకుండా, ఈ తాజా పిటిషన్‌పై మేము కోర్టు ధిక్కారం కింద విచారణను ప్రారంభించాలా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే తరువాత ధర్మాసనం తాజా పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది.
కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులే దాడికి పాల్పడిన అంశాన్ని అత్యవసరంగా విచారించాలని లాయర్ ప్రశాంత్ భూషణ్ కోరడంతో ఈ అంశాన్ని శుక్రవారం విచారించాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నిర్ణయించింది. కన్హయ్య కుమార్‌తో పాటు జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై దాడికి పాల్పడటంతో పాటు స్టింగ్ ఆపరేషన్‌లో తామే దాడి చేశామని ఒప్పుకున్న ముగ్గురు న్యాయవాదులు విక్రంసింగ్ చౌహాన్, యశ్‌పాల్ సింగ్, ఓంశర్మలపై సుప్రీంకోర్టు తనంత తానుగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని ప్రశాంత్ భూషణ్ అభ్యర్థించారు. ఈ నెల 15, 17 తేదీలలో పాటియాలా హౌస్ కోర్టు ఆవరణలోనే జరిగిన ఈ హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపించడానికి ఆదేశించాలని కూడా ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్‌లో కోరారు.